పప్పూ అంటూ కేటీఆర్ ట్వీట్ ! ఆ పప్పు  ఏ పప్పు అంటే ..?

పప్పూ అనే పదానికి జాతీయ స్థాయిలో పెద్ద గుర్తింపే ఉంది.జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని పప్పు అంటూ పిలుస్తూ ఉంటారు.

అలాగే ఏపీ రాజకీయాల్లో టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ను ఉద్దేశించి పప్పు అంటూ వైసీపీ నేతలు, టిడిపి రాజకీయ ప్రత్యర్ధులు విమర్శిస్తూ ఉంటారు.వారిపై వ్యంగ్యంగా ఏ విమర్శలు చేయాలన్నా పప్పు అనే పదాన్ని విరివిగా వాడుతూ, ఆయనను ఎగతాళి చేస్తూ ఉంటారు.

తాజాగా తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పప్పు అంటూ పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది.కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంది.

పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్, సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు.తనకు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కేటీఆర్ తిరిగి థాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు.

Advertisement

అదేవిధంగా తనకు శుభాకాంక్షలు చెప్పిన పోస్ట్ లకు థాంక్యూ పప్పు అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.అయితే కేటీఆర్ పప్పు అంటూ రిప్లై పెట్టింది అటు రాహుల్ కి , ఇటు లోకేష్ కి కాదు.

స్వయంగా తన సోదరి అయిన ఎమ్మెల్సీ కవితకు.హ్యాపీ బర్త్డే అన్నయ్య , ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి.

మరిన్ని విజయాలు సాధించాలి అంటూ ట్వీట్ చేయగా, థాంక్యూ పప్పు అంటూ కేటీఆర్ స్పందించారు.దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపించాయి.

స్వయంగా కేటీఆర్ ను పలువురు నెటిజన్లు దీనిపై ప్రశ్నించగా, అసలు విషయం బయట పెట్టారు.చిన్నప్పటి నుంచి కవితను ముద్దుగా పప్పు అని పిలుస్తామని, అందుకే తాను ఆ పేరుతోనే థాంక్స్ చెప్పినట్లుగా కేటీఆర్ సమాధానం ఇవ్వడంతో రాహుల్, లోకేష్ మాత్రమే కాదు కవిత కూడా పప్పే అంటూ పలువురు వ్యంగ్యంగా స్పందించారు.

విపరీతమైన తలనొప్పిని కూడా ఇట్టే పోగొట్టే మ్యాజికల్ డ్రింక్ ఇది..!
Advertisement

తాజా వార్తలు