ఎన్నికల కోడ్ యధేచ్చగా ఉల్లంఘన...!

సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ను అధికారులు తుంగలో తొక్కారు.

ఆఫీస్ టైమింగ్ పూర్తి కాగానే ఒక్క నిమిషం పనిచేయని ప్రభుత్వ అధికారులు, సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై, ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 8 గంటల వరకు పలు మండలాల్లో దళిత బంధు లబ్ధిదారుల ప్రక్రియను ఆన్లైన్ చేయడంపై అర్హులైన దళితులు మండిపడుతున్నారు.

పాలకవీడు మండలం హనుమయ్యగూడెం ఆన్లైన్ చేస్తున్న అధికారులను గ్రామ దళితులు అడ్డుకోవడంతో అక్కడ నుండి వెళ్లిపోయారు.హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా దళిత బంధు పథకం అర్హులకు కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికే ఇస్తున్నారని పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ, అర్హులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలు గ్రామాల దళితులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనలు చేపట్టి,జిల్లా కలెక్టర్ కి వినతిపత్రాలు అందిచగా, పరిశీలించి అనర్హులను తొలగించి అర్హులను ఎంపిక చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.

దళిత బంధులో అసలైన అర్హులకు అన్యాయం చేస్తున్నారని,అధికారులకు మొరపెట్టుకుంటే న్యాయం చేస్తామని చెబుతూ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ అడ్డదారిలో అనర్హుల జాబితాను ఆన్లైన్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన
Advertisement

Latest Suryapet News