మహేష్‌ బాబు, జక్కన్నల మూవీ సౌత్‌ ఆఫ్రికా ఫారెస్ట్‌ నేపథ్యంపై క్లారిటీ

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు మరియు రాజమౌళి ల కాంబోలో సినిమా పట్టాలెక్కబోతుంది.

వచ్చే ఏడాదిలో వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.

ఈ సమయంలోనే సినిమాకు సంబంధించిన కథ గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి.సినిమా లో కథ అలా ఉంటుంది ఇలా ఉంటుందని కొందరు ఊహించేస్తున్నారు.

మరి కొందరు అయితే ఈ సినిమా లో మహేష్ బాబును చత్రపతి శివాజీగా చూపించేందుకు గాను కథ సిద్దం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.చత్రపతి శివాజీ కథను విజయేంద్ర ప్రసాద్‌ రెడీ చేస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు.

శివాజీ కథ మాత్రమే కాకుండా మరి కొన్ని కథల విషయంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Advertisement
Vijayendra Prasad About Mahesh Babu And Rajamouli Film, Film News , Mahesh Babu

మహేష్‌ బాబు రాజమౌళి సినిమా కథ విషయంలో వస్తున్న వార్తలపై విజయేంద్ర ప్రసాద్‌ స్పందించాడు.ఆయన తాజాగా అలీతో సరదాగా టాక్ షో లో కనిపించాడు.

ఆ సందర్బంగా ఆయన మహేష్ బాబు తో సినిమా విషయమై స్పందించాడు.ఇప్పటి వరకు మహేష్‌ బాబుతో సినిమా కథ గురించి చర్చించలేదు.

ప్రస్తుతం రాజమౌళి పూర్తిగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా పైనే ఫోకస్ పెట్టాడంటూ విజయేంద్ర ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చాడు.మహేష్‌ బాబు కోసం కథ తయారు చేయాలంటే కాస్త కష్టమే అంటూ విజయేంద్ర ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

Vijayendra Prasad About Mahesh Babu And Rajamouli Film, Film News , Mahesh Babu

రాజమౌళి ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా ను ముగించిన తర్వాత కథ విషయమై చర్చలు మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు.ఇదే సమయంలో కథ విషయమై సంప్రదింపులు మొదలు పెట్టే సమయంలో పూరి జగన్నాధ్‌ ను కలిసి కథ గురించి చర్చిస్తానంటూ చెప్పుకొచ్చాడు.మొత్తానికి మహేష్‌ బాబు తో మూవీ విషయమై ఇప్పటి వరకు కథ చర్చలు మొదలు కాలేదని ఆయన ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు