యాక్టింగ్ స్కూల్లో వీడియో షేర్ చేసిన విక్కీ కౌశల్.. అభిమానులు ఫిదా?

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన పాకిస్తాన్ పై ఇండియా చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కిన ఉరి సినిమా ద్వారా పరిచయం అయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విక్కీ కౌశల్ అనంతరం పలు సినిమాలు చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న విక్కీ కౌశల్ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి వివాహం తర్వాత విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు.ఈ క్రమంలోనే  వీరికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా విక్కీ కౌశల్ దాదాపు 13 సంవత్సరాల క్రిందట ఈ వీడియోని షేర్ చేశారు.యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు.

Advertisement

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విక్కీ సహ విద్యార్థిని, ‘హే హై మెహబతియాన్’ షో ఫేమ్ షేరిన్ మీర్జా ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వీడియోని విక్కీ కౌశల్ తిరిగి పోస్ట్ చేశారు.ఇక ఈ వీడియోలో వీరిద్దరూ ఎంతో సరదాగా నటిస్తున్న టువంటి సన్నివేశాలు ఉన్నాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు విక్కీ కౌశల్ పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తూ ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు