నువ్వు నాకు నచ్చావ్ సీక్వెల్ రాబోతోందా... వెంకటేష్ ఏమన్నారంటే?

విక్టరీ వెంకటేష్(Venkatesh ) హీరోగా శైలేష్ కొలను (Shailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైందవ్(Saindhav) .

ఈ సినిమా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం విజయవాడ దుర్గమ్మ వారిని సందర్శించిన సంగతి మనకు తెలిసిందే.ఇలా చిత్ర బృందంతో అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నటువంటి వెంకటేష్, ఇతర చిత్ర బృందం విలేకరుల సమావేశంలో పాల్గొని వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

ఇక త్రివిక్రమ్(Trivikram ) రచయితగా కే విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nacchav) ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇప్పటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్లార్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తారు.

ఇలా ఒకానొక సమయంలో సెన్సేషనల్ హిట్ అందుకున్నటువంటి ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలు ఉన్నారా అంటూ విలేకరుల నుంచి వెంకటేష్ కి ప్రశ్న ఎదురైంది.

Venkatesh Interesting Comments On Nuvvu Naaku Nacchaav Sequel , Venkatesh,nuvvu
Advertisement
Venkatesh Interesting Comments On Nuvvu Naaku Nacchaav Sequel , Venkatesh,Nuvvu

ఇలా ఈ ప్రశ్న వేయగానే వెంటనే వెంకటేష్ సమాధానం చెబుతూ మీరు వెంటనే త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి కథ సిద్ధం చేయమని చెప్పండి అంటూ సమాధానం చెప్పారు దీంతో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా నవ్వుకున్నారు.ఇక తనకు ఏ పాత్ర నచ్చితే అలాంటి పాత్రలలోనే నటిస్తానే తప్ప నాకు ఏ విధమైనటువంటి డ్రీమ్ రోల్స్ లేవు అంటూ వెంకటేష్ తెలియజేశారు.ఇక టాలీవుడ్ హీరోలు అందరితో కూడా కలిసి సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెంకటేష్ తెలిపారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాథ్,ఆండ్రియా, రుహాని శర్మ, ఆర్య, నవాజుద్దీన్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు.

Advertisement

తాజా వార్తలు