ఇదెక్కడి విడ్డురం.. వడపావ్ తిని వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ బ్యూటీ..

కియారా అద్వానీ. ఈమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.

ఈమె తెలుగులోకి కూడా అడుగు పెట్టి ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబోలో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా కియారా అద్వానీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఈ సినిమాతో ఈ అమ్మడు సూపర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత ఈమెకు రామ్ చరణ్ బోయపాటి కాంబోలో వచ్చిన వినయ విధేయ రామ సినిమాలో అవకాశం వచ్చింది.

అయితే ఈ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు.కానీ రామ్ చరణ్, కియారా జోడీకి మంచి మార్కులు పడ్డాయి.

Advertisement
Varun Dhawan Kiara Advani Eat Vada Pav In Metro Details, , Metro, Varun Dhawan,

అందుకే వీరిద్దరి జోడీ మరోసారి తెరమీద కనిపించ నుంది.శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమాలో కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

ఇక దీంతో ఈమె పేరు మారుమోగి పోయింది.శంకర్ సినిమాలో హీరోయిన్ లకు కూడా గ్రాండ్ లుక్ ఉంటుంది.

ఈ సినిమాలో కూడా కియారకు రొమాంటిక్ టింజ్ తో పాటు కథలో కీలక పాత్ర ఉంటుందట.అందుకే కియారాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని టీమ్ చెబుతుంది.

Varun Dhawan Kiara Advani Eat Vada Pav In Metro Details, , Metro, Varun Dhawan,
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఇది ఇలా ఉండగా తాజాగా ఈ అమ్మడి గురించిన ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.ఈమె బాలీవుడ్ లో నటించిన జియో సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఈమె ముంబై మెట్రోలో ప్రయాణించింది.ఈ సందర్భంగా ఈమె వడపావ్ తింటూ కనిపించడంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

Advertisement

ఈ వీడియో చూసిన ఈమెపై కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు.

మెట్రోలో ఆహార పదార్ధాలు తినకూడదు నిషేధం.కానీ ఈమె అలా తినడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు.ఇదే పని సామాన్యులు చేసి ఉంటే ఇప్పటికే జరిమానా వేసేవారు.

కానీ సెలెబ్రిటీ అవ్వడం వల్ల అలా చెయ్యలేదు అంటూ అధికారులను కూడా విమర్శిస్తున్నారు.ఈ వీడియోలో ఏమిటో పాటు వరుణ్ ధావన్ మరికొంత మంది కూడా తిన్నప్పటికీ ఈమె మీదనే ట్రోల్స్ చేస్తున్నారు.

మరి ఈమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

తాజా వార్తలు