జపాన్ లో కనిపించిన విచిత్ర ప్రాణి సోషల్ మీడియా లో వైరల్

జపాన్ లో ఒక విచిత్రమైన ప్రాణి కనిపించింది.

వాస్తవానికి అది చూడడానికి కాకిలా కనిపించినా అది నిలుచున్న తీరును చూస్తే మాత్రం ఒక గొరిల్లా పిల్ల లాగా కనిపిస్తుండడం విశేషం.

జపాన్ లోని నగోయా ప్రాంతంలో ఒక ఇంటి ప్రాంగణం లో ఈ విచిత్ర ప్రాణి దర్శనమిచ్చి అందరిని ఆశ్చర్యపరచింది.అయితే కాకి జాతి లో ఇదో కొత్త జంతువు అయి ఉంటుంది అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Variety Crow In Japan It Looks Like Baby 2 Telugustop Gorilla-జపాన్ �

అయితే వాషింగ్టన్ యూనివర్సటీ పరిశోధకులు మాత్రం అది కాకే అని అయితే తన కాళ్లను,రెక్కలను ఒకే చోట చేర్చినప్పుడు అది అలా కనపడింది అని అంటున్నారు.అంతేకాకుండా దాని హెడ్ యూనిట్ కూడా విశాలంగా ఉండడం వల్ల అది కాకి కాదు గొరిల్లా పిల్ల అన్నట్లు కనిపించింది అని పరిశోధకులు అంటున్నారు.

అయితే కిటారో సింప్సన్ అనే ట్విటర్ యూజర్ ఈ కాకి గారిని వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు.ఇక అంతే ఈ ‘ కాకి ‘ కాని ‘ కాకి ‘ గారి వైనాన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

ఈ వీడియో కు ఒక్కసారిగా 90 లక్షల వ్యూస్ వచ్చి పడ్డాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ వీడియో ఎంతగా వైరల్ అయ్యిందో అన్న విషయం.ఇలాంటి పక్షిని తామెప్పుడూ చూడలేదని, ప్రకృతిలో ఇదో వింత జీవి అని అనని వాళ్ళు లేరు.

ఈ వీడియోను వేలాదిమంది షేర్ చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు