Vakkantham Vamsi Allu Arjun: నా పేరు సూర్య.. సినిమా కోసం ముందుగా అనుకున్నది అల్లు అర్జున్ ని కాదు: వక్కంతం వంశీ

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే.

స్టైలిష్ స్టార్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఎలాంటి స్టార్ హీరోల కైనా హిట్టు ఫ్లాపులు రావడం సర్వసాధారణం.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సినీ కెరియర్ లో కూడా డిజాస్టర్ సినిమాలు ఉన్నాయి.

ఇలాంటి డిజాస్టర్ సినిమాలలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఒకటి.సినీ ఇండస్ట్రీలో రచయితగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వక్కంతం వంశీ మొదటిసారిగా దర్శకుడిగా మారి అల్లు అర్జున్, అను ఇమ్మానియేల్ జంటగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే తాజాగా వక్కంతం వంశీ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Vakkantham Vamsi Interesting Comments About Allu Arjun Naa Peru Surya Movie Deta

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు.రచయితగా తనకు కిక్ సినిమా ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చిందని ఈయన తెలిపారు.

Vakkantham Vamsi Interesting Comments About Allu Arjun Naa Peru Surya Movie Deta

ఇకపోతే తాను టెంపర్ సినిమా కథ పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ కి స్క్రిప్ట్ వినిపించడంతో ఈ సినిమాకు నేను సూట్ అవుతానా అని ప్రశ్నించారని తెలిపారు.ఇక తన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని తారక్ చెప్పడంతో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా స్క్రిప్టు సిద్ధం చేశానని అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమాలో నటించాల్సిన ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా కాస్త అల్లు అర్జున్ వద్దకు వెళ్లిందని తెలిపారు.అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ అభిమానులు పెద్ద డిజాస్టర్ సినిమా నుంచి తప్పించుకున్నారంటూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు