వడ్డేపల్లి రవి చేరిక చెల్లదు:డీసీసీ

సూర్యాపేట జిల్లా:జిల్లా కాంగ్రేస్ పార్టీలో వడ్డేపల్లి రవి చేరిక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది.

టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో వడ్డేపల్లి రవి కాంగ్రేస్ పార్టీలో చేరారు.

ఈ విషయం తమకు తెలియదని,అతని చేరిక చెల్లదని డీసీసీ చెవిటి వెంకన్న యాదవ్ ప్రకటించారు.పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

కాంగ్రేస్ పార్టీ నుండి గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టిక్కెట్ ఆశించి భంగపడ్డ వడ్డేపల్లి రవి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రేస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ ఓటమికి కారణమయ్యారని ఆరేళ్ళ పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

విద్యుత్ వైర్లు తగిలి గడ్డి లోడు దగ్ధం
Advertisement

Latest Suryapet News