కమలా హారిస్‌కు ప్రియాంక గాంధీ అభినందనలు: నాయనమ్మపై ప్రశంసలు

అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపొందిన భారత సంతతికి చెందిన కమలా హారిస్‌కు ప్రపంచవ్యాప్తంగా పలువురు దేశాధినేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు కూడా ఆమెను అభినందిస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సైతం కమలకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆమె చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చరకు దారి తీసింది.

అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికాకు ఓ మహిళను ఉపాధ్యక్షురాలిగా ఎన్నుకునేందుకు శాతాబ్ధాల సమయం పట్టిందని, భారత్‌లో మాత్రం 50 ఏళ్ల కిందటే ఇందిరా గాంధీని దేశ ప్రధానిగా ఎన్నుకున్నారని ప్రియాంక గుర్తుచేశారు.అర్ద శతాబ్ధం కిందే ఇందిరా గాంధీ ఎంతో ధైర్య సాహసాలను చూపారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఇప్పుడు ప్రపంచ మహిళలను ముందుకు నడిపిస్తోందని అన్నారు.

కాగా, నవంబర్ 19, 1917న పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ దంపతులకు జన్మించిన ఇందిర, భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా జనవరి 1966 నుంచి మార్చి 1977 వరకు, ఆపై జనవరి 1980 నుంచి అక్టోబర్ 1984లో ఆమె హత్యకు గురి కాబడేంత వరకూ ప్రధానిగా కొనసాగారు.ఆ తరువాత మరే మహిళకూ భారత ప్రధానిగా పనిచేసే అవకాశం లభించలేదు.

Advertisement

ఇక భారతీయ, ఆఫ్రికా మూలాలున్న కమలా హారిస్ రంగంలోకి దిగడంతో అధ్యక్ష ఎన్నిక స్వరూపమే మారిపోయింది.ఒక మహిళ ఇంతవరకు అగ్రదేశం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక కాలేదు.

ఒక్క హిల్లరీ క్లింటన్ మాత్రమే 2016లో అధ్యక్ష బరిలోకి దిగినప్పటికీ ఆమె ఓడిపోయింది.ఉపాధ్యక్ష పదవికి ఇప్పటి వరకు ఇద్దరు మహిళలు పోటీ చేసినప్పట్టికీ విజయం సాధించలేకపోయారు.తొలిసారిగా 1984లో గెరాల్డ్ ఫెరారో డెమొక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగినప్పట్టికీ ఓటమి తప్పలేదు.2008లో రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన సారా పాలిన్ కు కూడా పరాజయం పాలయ్యారు.తాజాగా కమలా హారిస్ మాత్రం రేసులో నిలిచి విజయం సాధించారు.

కమలా హారిస్ ప్రస్తుతానికి ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైనా.భవిష్యత్ లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశాలున్నాయి.ఆ అర్హతలు కమలా హారిస్ కు ఉన్నాయి.2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ అధ్యక్ష బరిలో ఉంటారని ఆమె అభిమానులు ఇప్పటి నుంచే చెబుతున్నారు.ఈ నాలుగేళ్లు ఆమె పడే కష‌్టమే కమలా హారిస్ ను వైట్ హౌస్ కు నడిపిస్తుందంటున్నారు.

అదే జరిగితే అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా, తొలి నల్లజాతి మహిళ గా కమలా హారిస్ రికార్డు సృష్టిస్తారు.మొత్తం మీద మన కమల అగ్రరాజ్యం లో ఎప్పటికైనా అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తుందని ఆశిద్దాం.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు