Ram Charan Upasana : చరణ్ ప్రేమ కోసం అలాంటి త్యాగం చేసిన ఉపాసన… నిజంగా గ్రేట్ అంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) ఒకరు.

చిరంజీవి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి రామ్ చరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన ఉపాసన ( Upasana ) అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే వీరి వివాహం జరిగి 11 సంవత్సరాలు అయినప్పటికీ వీరి వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.రామ్ చరణ్ ఉపాసన మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్న సంగతి తెలిసిందే 11 సంవత్సరాలకు ఈ దంపతులకు చిన్నారి జన్మించారు.

ప్రస్తుతం తన కూతురి ఆలనా పాలన చూసుకుంటూ ఉపాసన ఎంతో సంతోషంగా ఉన్నారు.

Advertisement

ప్రస్తుతం తన కుమార్తెతో కలిసి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) కుటుంబంతో కలిసి ఉపాసన తన అత్తగారింట్లోనే ఉన్న సంగతి మనకు తెలిసిందే.పెళ్లి తర్వాత కొంతకాలం పాటు చిరంజీవి ఫ్యామిలీతో కలిసి ఉన్నటువంటి ఈ దంపతులు అనంతరం కొత్త ఇల్లు కొనుగోలు చేసి అక్కడికి షిఫ్ట్ అయ్యారు.కానీ కూతురు పుట్టిన తర్వాత పిల్లలు తమ తాతయ్య నాన్నమ్మ అమ్మమ్మలతో ఉంటేనే వారికి ఎన్నో గొప్ప విషయాలు తెలుస్తాయి అంటూ ఉపాసన తిరిగి చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అయినట్లు మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా చరణ్ ప్రేమ కోసం ఉపాసన పెద్ద త్యాగం చేశారని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.మరి చరణ్ ప్రేమ పొందడం కోసం ఉపాసన చేసిన ఆ త్యాగం ఏంటి అనే విషయానికి వస్తే.

ఉపాసన తల్లిదండ్రులకు( Upasana Parents ) ఇద్దరు ఆడపిల్లలే అనే విషయం మనకు తెలిసిందే.వీరికి మగ సంతానం లేకపోవడంతో ఉపాసన తండ్రి తన ఆడపిల్లలనే మగ పిల్లల లాగా పెంచి ఎంతో ధైర్యంగా వారిని ముందుకు నడిపించారు.అదే ధైర్యంతోనే ఉపాసన తన సోదరి కూడా పెద్ద ఎత్తున బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ సాధించారు.

ఇక తన తల్లిదండ్రులకు కొడుకులు లేకపోవడంతో తానే కొడుకుగా కుటుంబ బాధ్యతలను చూసుకుంటానని పెళ్లి తర్వాత కూడా నేను అత్తారింటికి వెళ్ళనని చాలా గట్టిగా చెప్పే వారట.ఇక చరణ్ ని ప్రేమించిన తర్వాత కూడా ఉపాసన ఇదే విషయం చెప్పింది.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!

పెళ్లి తర్వాత నేను అత్తగారి ఇంటికి రానని మా అమ్మ వారి దగ్గరే ఉండి వారి బాగోగులు చూసుకుంటాను అని చెప్పారట.

Advertisement

పెళ్లికి ముందు ప్రతి ఒక్క అమ్మాయి చెప్పే మాట ఇదే అయితే పెళ్లి తర్వాత( After Marriage ) మాత్రం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అత్తారింటికి వెళ్లాల్సి ఉంటుంది ఉపాసన విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తోంది.అయితే ఉపాసన తాను పెళ్లి చేసుకుంటే అత్తారింటికి వెళ్ళనని తన కుటుంబ సభ్యులకు గట్టిగా చెప్పినా తన తల్లి శోభ ఉపాసనను కూర్చోబెట్టుకొని తనకు చాలా వివరంగా జీవితం అంటే ఏంటి అనే విషయాలను వివరించారట.ఇలా జీవితం గురించి తన తల్లి ఎంతో అద్భుతంగా చెప్పడంతో ఉపాసన కాంప్రమైజ్ అయ్యి.

తాను అత్తారింటికి వెళ్లిందని తెలుస్తోంది.ఇలా చరణ్ ప్రేమ కోసం తన పంతాన్ని పక్కన పెట్టి ఈమె అత్తారింటికి వెళ్లి అక్కడ ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా అందరికీ ఈమె స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

తాజా వార్తలు