Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని విషయాలు

సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి.వీరరాఘవయ్య, నాగరరత్నమ్మల నలుగురు సంతానంలో కృష్ణ పెద్దవారు.

సినిమాల్లోకి అరగ్రేటం చేసిన తర్వాత దర్శకుడు ఆదుర్తి ఆయన పేరును కృష్ణగా మార్చారు.నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా కృష్ణ రాణించారు.మొత్తం 16 సినిమాలకు కృష్ణ దర్శకత్వం వహించారు.1974లో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం సొంతం చేసుకోగా.1976లో కేంద్ర కార్మికశాఖ నటశేఖర్ అనే బిరుదుతో ఆయనను సత్కరించింది.1997లో ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సౌఫల్య పురస్కారం కృష్ణకు దక్కింది.2000లో కృష్ణకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ అందించగా.2009లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.కృష్ణ పేరుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది.నటుడు, దర్శకుడు, నిర్మాతగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా కృష్ణ సేవలు అందించారు.1972 జై ఆంధ్ర ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించిన కృష్ణ.1984లో రాజీవ్‌గాంధీ పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.1989లో ఏలూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు.రాజీవ్‌గాంధీ మరణంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్, కృష్ణ మధ్య విబేధాలు వచ్చాయి.

Unknown Facts About Superstar Krishna ,superstar Krishna, Tollywood, Thene Manas

1962లో మేనమామ కూతురు ఇందిరాదేవితో కృష్ణకు వివాహమైంది.ఈ దంపతులకు మహేష్ బాబు, రమేష్ బాబు అనే ఇద్దరు కుమారులు. పద్మావతి, మంజుల, ప్రియదర్శని అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
Unknown Facts About Superstar Krishna ,Superstar Krishna, Tollywood, Thene Manas

ఇందిరతో వివాహమైన నాలుగేళ్లకు 1969లో విజయనిర్మలతో కృష్ణకు రెండో వివాహమైంది.దాదాపు 48 సినిమాల్లో విజయనిర్మలతో కలిసి ఆయన నటించారు.

ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహాం పెళ్లి వరకు దారి తీసింది.విజయనిర్మల డైరెక్షన్‌లో కృష్ణ చాలా సినిమాల్లో నటించారు.సినిమాల్లోకి రాకముందు నాటకాల్లో కృష్ణ నటించారు.1960లో చేసిన పాపం కాళీకెళ్లినా అనే నాటకంతో ఆయన గుర్తింపు పొందారు.ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టిన కృష్ణ.

ఎన్టీఆర్,ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజులతో మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశారు.

Unknown Facts About Superstar Krishna ,superstar Krishna, Tollywood, Thene Manas

కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు తాను ఎన్టీఆర్‌కు అభిమానినని, ఆయన సినిమా పాతాళభైరవి అంటే చాలా ఇష్టమని కృష్ణ పలు సార్లు బయటపెట్టారు.టాలీవుడ్ నుంచి హిందీ చిత్రరంగంలోకి అడుగుపెట్టిన తొలి హీరో కృష్ణనే.కృష్ణ దాదాపు 80కిపైగా హీరోయిన్లతో నటించారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
డ్రోన్‌ను నమ్ముకుంటే ఇంతే సంగతులు.. పెళ్లిలో ఊహించని సీన్.. వీడియో చూస్తే నవ్వాగదు..

విజయనిర్మలతో 48, జయప్రదతో 47, శ్రీదేవితో 31, రాధతో కలిసి 23 సినిమాలు చేశారు.నిర్మాతగా వివిధ భాషల్లో 50కి పైగా సినిమాలను నిర్మించారు.25 సినిమాల్లో ద్విపాత్రాభినయం, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి కృష్ణ రికార్డు సృష్టించారు.ఇక మొదటి సినిమాకు కృష్ణ గారికి వచ్చిన పారితోషికం 500 మాత్రమే అని ఒకప్పుడు ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉండేవారు.

Advertisement

అయితే ఆ విషయంపై కూడా కృష్ణ వివరణ ఇచ్చారు.తనకు తేనె మనసులు సినిమా ద్వారా వచ్చిన మొదటి రెమ్యునరేషన్ రూ.2000 అని చెప్పారు.అయితే అప్పట్లో అది చాలా పెద్ద రెమ్యూనరేషన్ అని కూడా గుర్తు చేసుకున్నారు.

అయితే చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాలపై ఎంతో ఆసక్తి ఉండేది.ఆయన తల్లిదండ్రులు మాత్రం కృష్ణను ఇంజినీర్‌ చేయాలనుకున్నారు.

కానీ, సీటు దొరక్కపోవడంతో డిగ్రీలో చేరారు.అక్కడ చదువుతున్నప్పుడు ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది.

ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు సినిమాలపై ఇష్టం మరింత పెరిగి ఈ రంగంవైపు వచ్చేశారు.

తాజా వార్తలు