ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?

తన చక్కటి రూపంతో పాటు మంచి నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న నటి భావన.

కేరళలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో గోపీచంద్ తో తొలి సినిమా చేసింది.

వీరిద్దరు కలిసి ఒంటరి అనే సినిమాలో నటించి తెలుగు జనాలకు పరిచయం అయ్యింది.భావన ఇప్పటికీ తెలుగు జనాలకు బాగానే పరిచయం.

ఒంటరితో పాటు హీరో, మహాత్మ సహా పలు సినిమాల్లో నటించింది.చక్కటి హీరోయిన్ గా గుర్తింపు పొందినప్పటికీ టాలీవుడ్ లో అంతగా అవకాశాలు రాలేదు.

ఈ కారణంగా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది ఈ క్యూట్ బ్యూటీ.తమిళ జనాలను తన నటనతో బాగానే ఆకట్టుకుంది.

Advertisement
Unknown Facts About Heroine Bhavana , Tollywood , Bhavana , Kollywood , Mahatma

అక్కడ తనకు వరుసగా ఆఫర్లు వచ్చాయి.అటు తన సొంత సినిమా పరిశ్రమ మల్లూవుడ్ లోనూ పలు సినిమాలు చేసిన జనాలను ఆకట్టుకుంది.

Unknown Facts About Heroine Bhavana , Tollywood , Bhavana , Kollywood , Mahatma

కెరీర్ బాగానే కొనసాగుతున్న సమయంలోనే.2017లో కన్నడ సినీ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరి వివాహం తర్వాత కూడా ఆమె పలు సినిమాల్లో నటించింది.పెళ్లి తర్వాత కూడా చక్కటి ప్రదర్శన కొనసాగించింది.

అటు తెలుగులో మాత్రం 2009లో చివరి సినిమా చేసింది.శ్రీకాంత్ హీరోగా నటించిన మహాత్మ సినిమాతోనే తెలుగు జనాలకు దూరం అయ్యింది.ఈ సినిమా రిలీజ్ అయి దశాబ్దం దాటింది.

అయినా మళ్లీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయాలేదు ఈ అందాల తార.

Unknown Facts About Heroine Bhavana , Tollywood , Bhavana , Kollywood , Mahatma
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

నిజానికి భావన నటించింది కొన్ని సినిమాలే.అయినా రెమ్యునరేషన్ విషయలంలో నిర్మాతలను బాగా డిమాండ్ చేసేదనే గుసగుసలు వినిపించాయి.అందుకే ఆమెను కొందరు దర్శక నిర్మాతలు కావాలనే దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

అంతేకాదు అప్పట్లో భావనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు.కొంతకాలం ఆమె కోర్టుల చుట్టే తిరగడం సిరిపోయింది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఇన్స్పెక్టర్ విక్రమ్ అనే సినిమా చేస్తుంది.ఈ సినిమాకు ప్రముఖ కన్నడ దర్శకుడు నరసింహ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా అయినా తన కెరీర్ ను మళ్లీ స్వింగ్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి.

తాజా వార్తలు