కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెలుగులో వచ్చిన సినిమాల్లో మొదటి కమర్షియల్ హిట్ గా ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా నిలిచింది అనడంలో సందేహం లేదు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా ను ఆహా వారు ఓటీటీ స్ట్రీమింగ్ కు కొనుగోలు చేయడం జరిగింది.
సినిమా విడుదల అయిన రెండు వారాల్లోనే స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు.మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను దక్కించుకున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీ లో విడుదల చేయబోతున్న నేపథ్యం లో ఖచ్చితంగా ఆహా లో కూడా అత్యధికులు చూసే అవకాశం ఉంది అంటున్నారు.
ఆహా వారు ఈ సినిమా ను మరింత ప్రచారం చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు.స్ట్రీమింగ్ కు రెడీ అయిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా ను ఆహా వారు ఈ నెల 28న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
![Telugu Srkalyana, Telugu-Movie Telugu Srkalyana, Telugu-Movie](https://telugustop.com/wp-content/uploads/2021/08/SR-Kalyana-mandapam-movie-ott-release-datelatest-tollywood.jpg )
ఇటీవల విడుదల అయిన సినిమాల్లో బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా నిలిచింది.కనుక ఎస్ కళ్యాణ మండపం సినిమా ను వెంటనే ఓటీటీ ద్వారా విడుదల చేయడం ద్వారా ఆహా వారు కూడా మంచి లాభాన్ని దక్కించుకునేలా ప్లాన్ చేశారు.మొత్తానికి ఓటీటీ మరియు థియేటర్ ల ద్వారా ఒకే సారి ప్రేక్షకులను ఈ సినిమా ఎంటర్ టైన్ చేయబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
థియేటర్లలో ఇంకా ఆడుతున్న ఈ సినిమా ను ఓటీటీ లో విడుదల చేయడం కూడా కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన వసూళ్లు బాగా నే ఉన్నాయి.
కనుక ఓటీటీ లో మరో వారం లేదా వారాలు ఆపితే బాగుంటుంది కదా అంటూ కొందరు సలహా ఇస్తున్నారు.కాని ఆహా వారు రెండు వారాల్లోనే స్ట్రీమింగ్ చేసేలా హక్కులు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమా లో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది.సాయి కుమార్ హీరో తండ్రి పాత్రలో కీలకంగా కనిపించాడు.