బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III( King Charles III ) పుట్టినరోజు వేడుకలు లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో( Buckingham Palace ) ఘనంగా జరగాయి.ఈ కార్యక్రమానికి భారతీయ నర్సులు,( Indian Nurses ) హెల్త్ కేర్ వర్కర్స్, నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) వైద్యులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
75వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎన్‌హెచ్‌ఎస్‌లో 1,50,000 మంది అంతర్జాతీయ నర్సులు ఇతర హెల్త్ కేర్ వర్కర్స్‌కు భారతీయులు నాయకత్వం వహిస్తున్నారు.భారత్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, నేపాల్, కెన్యా తదితర దేశాలకు చెందిన దాదాపు 400 మంది నర్సులు మంగళవారం సాయంత్రం కింగ్ చార్లెస్ పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారత్‌కు చెందిన స్టాఫ్ నర్స్ శ్రీజిత్ ములాలీధరన్( Shreejith Mulaleedharan ) మాట్లాడుతూ.కింగ్‌ను కలవడమన్నది జీవితంలో ఎవరికైనా అద్భుతమైన అనుభవమన్నారు.
బ్రిటీష్ సిక్కు నర్సుల వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రోహిత్ సాగూ( Rohit Sagoo ) మాట్లాడుతూ.కింగ్ చార్లెస్‌ను కలవడం, ఈ దేశానికి సిక్కు నర్సులు అందిస్తున్న సేవల గురించి చెప్పడం విశేషమన్నారు.
ఎన్‌హెచ్ఎస్‌లో ఎంతోమంది సిక్కు నర్సులు పనిచేస్తున్నారని, సమాజానికి ఎన్నో దాతృత్వ పనులు చేస్తున్నారని రోహిత్ పేర్కొన్నారు.బ్రిటన్ హెల్త్ సెక్రటరీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన విక్టోరియా అట్కిన్స్ మాట్లాడుతూ.
ఎన్‌హెచ్ఎస్‌లో పనిచేయడానికి భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన నర్సులు , హెల్త్ కేర్ వర్కర్స్‌ను కింగ్ చార్లెస్ ప్రశంసించారు.యూకే - భారత్ మధ్య సంబంధాలు అద్భుతంగా వున్నాయని.ప్రధాని రిషి సునాక్( PM Rishi Sunak ) అనుమతితో త్వరలో భారతదేశాన్ని సందర్శించడానికి ఎదురుచూస్తున్నానని విక్టోరియా ( Victoria Atkins ) పేర్కొన్నారు.
ఇకపోతే.కింగ్ ఛార్లెస్ తన పుట్టినరోజు నాడు ఉల్లాసంగా గడిపారు.
దేశం నలుమూలల నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి అతిథులు తరలివచ్చారు.
ఎన్‌హెచ్ఎస్ గాయక బృందంతో ‘‘హ్యాపీ బర్త్ డే ’’ అంటూ ఏర్పాటు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.ఈ సందర్భంగా రిసెప్షన్ రాచరిక కార్యక్రమాలతో నిండిపోయింది.అంతకుముందు క్వీన్ కెమిల్లాతో( Queen Camilla ) కలిసి ఆక్స్‌ఫర్డ్ షైర్‌లోని ఆహార పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కింగ్ చార్లెస్ .కరోనేషన్ ఫుడ్ ప్రాజెక్ట్‌ను( Coronation Food Project ) ప్రారంభించారు.ఇది కీలక సమయాల్లో ఆహారాన్ని అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు మద్ధతు ఇచ్చేందుకు నెలకొల్పారు.
అలాగే కింగ్ ఛార్లెస్ మంగళవారంతో 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో లండన్ నగరంలోని పలు ప్రాంతాల్లో గన్ సెల్యూట్‌లు నిర్వహించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy