ఏపీలో మరో రెండు ఉప ఎన్నికలు ? అందరికీ టెన్షనే ? 

అఖండ మెజారిటీతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం కొలువుతీరి దాదాపు రెండేళ్లు అవుతోంది.

ఈ రెండేళ్లల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ వస్తూనే తమ పట్ట నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

టిడిపి ,జనసేన, బిజెపి పార్టీలు సైతం 2019 ఎన్నికలలో ఓటమి చవిచూసినా, జనాల్లో తమకు ఆదరణ పెరుగుతోందని చెప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.వైసిపి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇటీవల జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో తమ పట్టు నిలుపుకునేందుకు అన్ని పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు చేసినా, చివరకు అధికార పార్టీ వైసీపీ నే పై చేయి సాధించింది.ఆ ఎన్నికలు ముగియగానే మళ్లీ ఇప్పుడు తిరుపతి లో సభ ఉప ఎన్నికలు తెరపైకి వచ్చాయి.

ఈ ఎన్నికలలో బిజెపి వైసిపి మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.బిజెపి అగ్రనేతలు అంత వైసీపీని ఓడించేందుకు జనసేన పార్టీ బిజెపికి మద్దతు ఇస్తుండడంతో, గెలుపునకు ఇబ్బంది ఉండదని బిజెపి అంచనా వేస్తుండగా,  వైసిపి మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది .ఇదిలా ఉంటే తిరుపతి ఎన్నికలు  

Advertisement

మరో రెండు ఉప ఎన్నికలు ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేలా కనిపిస్తోంది.తాజాగా వైసీపీ బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో, అక్కడ అసెంబ్లీ ఉప ఎన్నిక అనివార్యమైంది.అలాగే ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మెట్ లో తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు.

అయితే దీనిపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏ నిర్ణయమూ తీసుకోలేదు.  కాకపోతే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించే అవకాశాలే ఎక్కువ గా కనిపిస్తుండటంతో,  త్వరలోనే ఏపీ లో రెండు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అయితే గంటా మాత్రం తిరిగి మళ్లీ తాను పోటీ చేయనని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగిని పోటీకి నిలబడతాను అంటూ ప్రకటన చేశారు.అయితే ఈ రెండు చోట్ల వైసీపీ కి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.

ఎందుకంటే కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం వైసీపీకి మంచి పట్టు ఉంది.ఇక్కడ గెలుపు కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.అలాగే విశాఖలో నూ వైసీపీకి బలం పెరిగిందని, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు రుజువు చేశాయి.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
పిఠాపురంలో యూ.ఎస్.ఏ, ఎన్.ఆర్.ఐ సేవలు అభినందనీయం అంటూ నాగబాబు కామెంట్స్..!!

అదికాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బిజెపి, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పై విశాఖ జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాగే టిడిపి గతంతో పోలిస్తే బాగా బలహీన అవడం వంటి కారణాలతో ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చినా, తమక ఏ ఇబ్బంది ఉండదు అని వైసిపి నమ్మకం గా ఉంది.ఏది ఏమైనా వరుసగా ఎన్నికలు వస్తుండడం అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు