రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త!

ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకువచ్చేందుకు ఎండీ సజ్జనార్ రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.ఏదైనా పండగ వస్తే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు.

అలాగే టీఎస్ కార్గో లాంటి సౌకర్యాలు తీసుకువచ్చారు.కొత్త ఆదాయ మార్గాలను వెతికి మరీ వాటిని అమలు చేస్తున్నారు.

ఏదైనా పండగ వస్తే దానికి తగ్గ ఆఫర్ ప్రకటిస్తున్నారు.తాజాగా మరో ఆఫర్ ప్రకటించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పారు సజ్జనార్.రాఖీ పౌర్ణమి రోజు సోదరులకు రాఖీలు కట్టలేని వారు వారికి వాటిని పంపించేందుకు కొత్త సౌకర్యాన్ని తెచ్చింది టీఎస్ ఆర్టీసీ.

Advertisement

ఆర్టీసీ కార్గో, పార్శిల్ సర్వీసుల ద్వారా అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చని ప్రకటించింది సంస్థ.హైదరాబాద్, సికింద్రాబాద్ లోనైతే ఇంటికే వెళ్లి అందిస్తామని చెప్పింది ఆర్టీసీ.

ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లకు ఫోన్ చేస్తే పూర్తి సమాచారం చెబుతారని ప్రకటించింది ఆర్టీసీ.

ఊర్ల నుండి హైదరాబాద్ రాలేని వారికి ఈ సదుపాయం ఎంతో ప్రయోజనంగా ఉంటుందని వెల్లడించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పుడూ తోడుగా ఉంటుందని చెప్పారు.అందుకే వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాల్ని తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు ఎండీ సజ్జనార్.అలాగే ఆర్టీసీ బస్సు సర్వీసులను ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆ పోస్ట్ లు షేర్ చేసేది ప్రభాస్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!

ప్రైవేటు వాహనాల కంటే కూడా ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని అలాగే సౌకర్యవంతంగా ఉంటుందని సూచించారు.

Advertisement

తాజా వార్తలు