కాంగ్రెస్ లో ఎక్జిక్యూటివ్ కమిటీ ! రేవంత్ ను ఆపేదెవరు ? 

తెలంగాణ కాంగ్రెస్ ను పూర్తిగా ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలైంది.దీనిలో భాగంగానే పీఏ సీని మార్చారు.

కొత్తగా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు .దీనిలో 24 మంది ఉపాధ్యక్షులను నియమించారు.మొత్తం 84 మందిని ప్రధాన కార్యదర్శి హోదాలో నియమించారు.

ఆరుగురు జిల్లా అధ్యక్షులను మార్చారు.పాత డీసీసీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులు,  ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు .మొత్తంగా ఏఐసిసి తెలంగాణ పిసిసిని జంబ్లింగ్ చేసి జంబో కమిటీని నియమించారు.పిఎసి, పీఈసీ, పీసీసీ కమిటీల్లో మొత్తం 170 మందికి స్థానం కల్పించారు.40 మందితో కొత్తగా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటు చేశారు.పిఎసి లోని 21 మందికి అదనంగా మరో 15 మందిని నియమించారు.

 టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు , ఎమ్మెల్యేలను దీనిలో నియమించారు.కొండ సురేఖ , వినోద్ అనిల్ లో ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారని భావించినా,  ఆ ముగ్గురిని ఎగ్జిక్యూటివ్ కమిటీ లోకి తీసుకున్నారు   ఇక డిసిసి అధ్యక్షులుగా కాంగ్రెస్ కొత్తవారికి అవకాశం కల్పించింది.24 మందిని జిల్లా అధ్యక్షులను ప్రకటించగా,  గ్రేటర్ కమిటీలో కొత్తగా ఖైరతాబాద్, హైదరాబాద్ జిల్లాలకు అధ్యక్షులను నియమించారు.అలాగే సికింద్రాబాద్ తో పాటు, సూర్యాపేట , రంగారెడ్డి, ఖమ్మం ,వరంగల్ ,అసిఫాబాద్ ,సంగారెడ్డి, జనగామ, భూపాలపల్లి జిల్లాలను పెండింగ్ లో పెట్టారు.

Advertisement
Tpcc Chief Revanth Reddy Executive Committees For Congress Party Details, Revant

ప్రస్తుతం నియమించిన నియామకాల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఎక్కడా లేదు.

Tpcc Chief Revanth Reddy Executive Committees For Congress Party Details, Revant

పూర్తిగా రేవంత్ మార్క్ ఈ కమిటీలలో కనిపిస్తోంది.రేవంత్ రెడ్డి వర్గంగా గుర్తింపు పొందిన వారికి సీనియారిటీతో సంబంధం లేకుండా ఉపాధ్యక్ష,  ప్రధాన కార్యదర్శుల పదవులు రావడం , పార్టీలో చర్చనీయాంసంగా మారింది.ప్రస్తుత కమిటీ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు గుర్రుగా ఉన్నారు .ఈ కమిటీలో తమకు సరైన గుర్తింపు దక్కలేదని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ కు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ కల్పించినట్లుగా ఈ కమిటీని చూస్తే అర్థమవుతుంది.

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో, రేవంత్ చురుగ్గా వ్యవహరిస్తుండడం , సీనియర్ల వల్ల పెద్దగా ఉపయోగం లేదన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుండడంతో,  రేవంత్ కి పూర్తిగా స్వేచ్ఛ కల్పించినట్లు ఈ కమిటీ నియామకం చూస్తే అర్థమవుతుంది.   .

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు