స్టార్ హీరో కుమార్తెకు పెద్ద సినిమా ఆఫర్?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ ఇద్దరు కుమార్తె లు హీరోయిన్స్ గా పరిచయం అయిన విషయం తెలిసిందే.చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

 Rajashekhar Daughter Shivatmika Movie With Star Hero ,rajasekhar,shivatmika,shiv-TeluguStop.com

ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోక పోవడం తో శివాత్మిక కెరియర్ సందిగ్ధంలో పడ్డట్లు అయింది.వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ని కాదనకుండా చేస్తూ కెరీర్ లో ముందుకు నడిచే విధంగా శివాత్మిక ప్రయత్నాలు చేస్తుంది.

భారీ అంచనాలున్న సినిమాల్లో కాకుండా చిన్న చిన్న సినిమాలు నటిస్తూ మంచి పేరును సొంతం చేస్తుంది.తాజాగా పంచతంత్రం సినిమా లో మంచి పాత్ర పోషించడం ద్వారా ఈ ముద్దుగుమ్మ కు స్టార్ హీరోయిన్స్ జాబితా లో చోటు దక్కించుకునే అవకాశం లభించింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Telugu Dorasani, Jeevitha, Panchatantram, Rajashekhar, Shivani, Shivatmika-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శివాత్మిక ఒక తెలుగు యంగ్ స్టార్ హీరో కి జోడిగా నటించే అవకాశం దక్కించుకుందట.ఆ హీరో ఈ మధ్య కాలం లో వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు.ఆ హీరో కి జోడిగా శివాత్మిక నటించడం ద్వారా కచ్చితంగా ఆమె కు మంచి పాపులారిటీ లభించడం తో పాటు ముందు ముందు స్టార్ హీరో లకు జోడిగా నటించే అవకాశాలు దక్కుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా కూడా త్వరలోనే ఈమె చేయబోతున్న సినిమా ల జాబితా పెద్దగా ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియా లో మరియు వెబ్ మీడియా లో ఈమె గురించి రకరకాల వార్తలు ప్రచారం జరుగుతున్నాయి.కెరియర్ లో ఈమె ముందుకు సాగడం ఆ సాధ్యం అనుకున్న వారు ఇప్పుడు శివత్మిక సాధిస్తున్న ఆఫర్స్ చూసి ముక్కును వేలేసుకుంటూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube