కరోనా వల్ల సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాలు వాయిదా పడ్డాయి.రెండేళ్లుగా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద చిన్న సినిమాలు కలిపి మొత్తం యాబై కి పైగా రిలీజ్ లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్నాయి.కొన్ని సినిమాలు ఎలాగూ విడుదల వాయిదా పడుతుంది కాదా అనుకుని షూటింగ్ ను వాయిదా వేస్తూ వస్తున్నారు.
ఇక సంక్రాంతి కానుకగా రెండు భారీ సినిమాలు విడుదల అవ్వాల్సి ఉండగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఆర్ ఆర్ ఆర్ మరియు రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతికి విడుదల అవ్వాలనుకుని వాయిదా పడ్డాయి.
మళ్లీ ఈ సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యేది క్లారిటీ ఇచ్చారు.ఆర్ ఆర్ ఆర్ ను మార్చి లో సాధ్యం అయితే విడుదల చేస్తాం అంటూ తేదీని ప్రకటించారు.
ఒక వేళ అది సాధ్యం కాకుంటే అంటూ మరో తేదీని కూడా రాజమౌళి టీమ్ అధికారికంగా ప్రకటించారు.ఇక రాధేశ్యామ్ సినిమా ను కూడా మార్చి నెల లోనే విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఫిబ్రవరి లో సినిమాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల అవ్వబోతున్నాయి.ఇటీవలే ఆచార్య సినిమా ను ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
సినిమా విడుదల తేదీ లు వాయిదా పడ్డ నేపథ్యం లో అభిమానులు నిరుత్సాహం తో ఉన్నారు.ఇప్పుడు మళ్లీ కొత్త తేదీ లను తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఈ నెల చివరి వరకు అన్ని సినిమా లకు సంబంధించిన కొత్త విడుదల తేదీ లు వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఖచ్చితంగా సమ్మర్ లో సినిమా ల జాతర ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం గా చెబుతున్నారు.