సినిమా తారలు అంటేనే లగ్జరీ జీవితానికి కేరాఫ్ అడ్రస్.వారు ఉండే బంగళా.
తిరిగే కారు, తినే తిండి, వేసుకునే బట్టలు.అన్నీ లగ్జరీగానే ఉండాలి అనుకుంటారు.
చాలా మంది నటీనటులకు లగ్జరీ కార్లంటే చెప్పలేనంత మోజు.హీరోలే కాదు.
హీరోయిన్లకూ ఈ కార్ల పిచ్చి ఉంది.మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వస్తుందంటే చాలా దాన్ని తమ గ్యారీజీలోకి తెచ్చుకోవాలని ఆరాట పడతారు.
అంతేకాదు.నచ్చిన కార్లను విదేశాల నుంచి సైతం తెప్పించుకునేందకు వెనుకాడరు.
తాజాగా బాలీవుడ్ తారల కన్ను మెర్సిడెస్- మైబాహ్ జీఎల్ఎస్-600 కారుపై పడింది.దాన్ని ఎలాగైనా తమ గ్యారేజీలోకి తెచ్చుకోవాలని అనుకున్నారు.
అనుకున్నదే తడవుగా ఈ కారును పలువురు బాలీవుడ్ స్టార్స్ వరుస బెట్టి కొనుగోలు చేస్తున్నాడు.ఈ కారును బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ దక్కించుకుంది.
బాలీవుడ్ లో మాంచి ఊపు మీదున్న ఈ ముద్దుగుమ్మ మంచి పారితోషకం కూడా తీసుకుంటుంది.తాజాగా ఆమె ఈ కారు కొనుగోల చేయడంతో ఎలైట్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
కృతి సనన్ ఒక్కతే కాదు.గత కొంత కాలంగా పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ కారును కొనుగోలు చేశారు.
రణ్ వీర్ సింగ్, ఆయుష్మాన్ ఖురానా, అర్జున్ కపూర్ సహా పలువురు ఈ కారును తమ గ్యారేలోకి తెచ్చేసుకున్నారు.
మెర్సిడెస్ లగ్జరియస్ ఎస్యూవీ ఇన్ ద వరల్డ్ గా పేరు పొందింది ఈ కారు.దీని ధర అక్షరాలా2.43 కోట్ల రూపాయలు.ధర మాదిరిగానే ఈ కారులోని ఫీచర్లు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.
జర్మన్ కంపెనీ తయారు చేసే ఈ కారుపై బాలీవుడ్ తారలు వీపరీతంగా మనసు పడుతున్నారు.బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు రిచ్ పీపుల్ కూడా ఈ కారు పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మొత్తానికి మెర్సిడెస్- మైబాహ్ జీఎల్ఎస్-600 కారు ఇండియాలో హట్ కేకులా మారిపోయింది.తన అందం, అద్భుత ఫీచర్లతో అందరి మనసులు దోచేస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy