నటించిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ కొట్టిన టాలీవుడ్ హీరోయిన్స్ వీళ్ళే

సినిమా ఇండస్ట్రీ కి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గముంటుంది కొందరు మోడలింగ్ నుంచి వస్తే, కొందరు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళని బట్టి ఇండస్ట్రీకి వస్తారు, ఇంకొందరు ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియకుండానే ఇండస్ట్రీకి వస్తారు అలాంటి వారు ఎవరో ఇండస్ట్రీకి వాళ్ళు ఎలా వచ్చారు ఇప్పుడు చూద్దాం.

సమంత ప్రస్తుతం నాగ చైతన్య ని పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలు అయినా సమంత మొదట్లో మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది తర్వాత మాస్కో విన్ అనే సినిమాలో రాహుల్ రవీంద్రన్ కి తోడుగా నటించి మెప్పించింది.

ఆ తర్వాత గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చిన ఏ మాయ చేశావే సినిమా లో నటించి తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత చాలా సినిమాల్లో అగ్ర హీరోల సరసన నటించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుని నాగచైతన్య ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

Tollywood Heorines Who Got Luck With Very First Movie, Samantha, Sai Pallavi, Ra

ఆ తర్వాత వచ్చిన హీరోయిన్ సాయి పల్లవి.సాయి పల్లవి ఈటీవీ లో లో ప్రసారమయ్యే డ్యాన్స్ షో అయినటువంటి డి2 లో పార్టిసిపెట్ చేసింది ఆ తర్వాత 2014లో జార్జియాలో చదువుకుంటున్నప్పుడు ప్రేమమ్ సినిమా డైరెక్టర్ ఆమెను చూసి ఒప్పించి ఆమెతో సినిమా చేయించారు.ఆ తర్వాత శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.

Tollywood Heorines Who Got Luck With Very First Movie, Samantha, Sai Pallavi, Ra

తర్వాత చెప్పుకోవాల్సిన ఇంకో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ మొదట్లో సెవెన్ బై జి బృందావన కాలనీ కన్నడ రీమేక్ లో నటించి మంచి గుర్తింపు సాధించింది అయితే తెలుగులో మాత్రం సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మంచి హిట్ సాధించింది ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్ తో ధ్రువ, బ్రూస్ లీ, మహేష్ బాబు తో స్పైడర్ సినిమా లో నటించి ప్రజల ఆదరణ పొందింది.

Tollywood Heorines Who Got Luck With Very First Movie, Samantha, Sai Pallavi, Ra
Advertisement
Tollywood Heorines Who Got Luck With Very First Movie, Samantha, Sai Pallavi, Ra

మెహరీన్ ఇండస్ట్రీ కి రావడానికి ముందు ఒక తంసప్ యాడ్ లో విశాల్ తో కలిసి నటించింది.ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో నాని హీరోగా వచ్చిన కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమా లో హీరోయిన్ గా నటించి అచ్చం తెలుగు అమ్మాయి లానే అనిపించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది తర్వాత మెహరీన్ రాజా ది గ్రేట్ సినిమా రవితేజ పక్కన హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత F2 సినిమాలో వరుణ్ తేజ్ పక్కన అలాగే మహానుభావుడు సినిమాలో నటించి తను మంచి నటిగా గుర్తింపు పొందింది.

ఆ తర్వాత చెప్పుకోవాల్సిన పేరు రాశి కన్నా ఒకసారి తను కోల్డ్ క్రీమ్ కాంపైనలో పాటిస్పేట్ చేస్తే కోల్డ్ క్రీం వస్తుందని అనడంతో రాశి పార్టిసిపేట్ చేసింది దాంతో జాన్ అబ్రహం పక్కన హీరోయిన్ గా మద్రాస్ కేఫ్ సినిమాలో అవకాశం కూడా వచ్చింది.అక్కడ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన తర్వాత తెలుగులో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నాగశౌర్య ఫస్ట్ మూవీగా తెరకెక్కిన ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్ గా పరిచయం అయి మంచి పేరు సంపాదించింది ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన సుప్రీం సినిమా లో బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ చేసి మంచి పేరు సంపాదించింది.ఆ తర్వాత వచ్చిన హీరోయిన్స్ లో నభానటేష్ ఒకరు.

చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకున్న నభా నటేష్ కన్నడలో శివ రాజ్ కుమార్ సినిమాలో నటించి అందరి మన్ననలు పొందింది.తెలుగులో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఇంకో హీరోయిన్ రితికా సింగ్ ఈమె ప్రొఫెషనల్ బాక్సర్ బాక్సింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ సుధా కొంగర ఆమెను చూసి బాక్సింగ్ తరహా సినిమా చేయడానికి ఆమెను ఒప్పించి ఆమెతో తెలుగులో గురు లాంటి సినిమా చేశారు.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు