ఈ రోజు బదిలీ నిన్న ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట జిల్లా మత్స్య శాఖ అధికారి ఠాగూర్ రూపేందర్ సింగ్ ను శుక్రవారం ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

నల్లగొండ ఏసీబీ డిఎస్పి జగదీష్ చంద్ర వెల్లడించిన వివరాల ప్రకారం.జిల్లా కేంద్రంలో గల చెరువులో చేపల పట్టుటకు అనుమతి కావాలని ఒక మత్స్య సొసైటీ సభ్యుడు దరఖాస్తు పెట్టుకోగా రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు.సరే అని ఒప్పుకున్న బాధితుడు లంచం ఇవ్వడం ఇష్టంలేక తమను ఆశ్రయించగా పూర్తి దర్యాప్తు చేసిన అనంతరం సదరు అధికారిని ట్రాప్ చేసి శుక్రవారం మధ్యవర్తుల ద్వారా రూ.25 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు.అవినీతి అధికారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని,ఇంట్లో సోదాలు నిర్వహించామని తెలిపారు.2016లో రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కేసు కూడా ఇంకా కోర్టులో ఉందని,గత రెండు సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న ఇతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని,శనివారం సూర్యాపేట జిల్లా నుండి ఈ అధికారి బదిలీ అయ్యే అవకాశం ఉన్నందున సొసైటీ సభ్యుడిపై ఒత్తిడి తేవడంతో అతను విసుగు చెంది ఏసీబీ అధికారులకు తెలిపినట్టు పేర్కొన్నారు.

Latest Suryapet News