కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటికి దూరంగా ఉండాల్సిందే..!

గుండె ఆరోగ్యంలో కొలెస్ట్రాల్( Cholesterol ) అనేది కీలక పాత్ర పోషిస్తుంది.గుండె పదిలంగా ఉండాలి అంటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలి.

కానీ ఇది ఇటీవల రోజుల్లో కత్తి మీద సాములా మారింది.చాలా మంది అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ అదుపులోకి రావాలంటే కొన్ని ఆహారాలకు కచ్చితంగా దూరంగా ఉండాలి.

ముఖ్యంగా కొవ్వులు జోడించి తయారు చేసిన కేకులు, కుకీలు, ( Cakes, Cookies )ఇత‌ర‌ తీపి పదార్థాలను డైట్ నుంచి కట్ చేయాలి.వెన్న తీయని పాలు, పెరుగు, జున్ను, ఫ్యాట్ మిల్క్ తో తయారు చేసిన స్వీట్స్ జోలికి పొరపాటున కూడా వెళ్ళకూడదు.

Advertisement

అలాగే అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు వేరు శనగలు, జీడిపప్పు ( Chickpeas, cashews )వంటి ఆహారాలను అవాయిడ్ చేయాలి.పాలిష్ చేసిన బియ్యం, మైదా, నూడిల్స్, మొక్కజొన్న పిండి వంటి ఆహారాలు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.కాబట్టి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

కొలెస్ట్రాల్ తగ్గాలంటే గొడ్డు మాంసం, పంది మాంసం మరియు గొర్రె మాంసం తినడం మానుకోవాలి.వేయించిన ఆహారాలను తీసుకోవడం పూర్తిగా తగ్గించేయాలి.

ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి.వారానికి రెండు మూడు సార్లు చేపలు తింటే ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

అలాగే ఫైబర్ మీ రక్తప్రవాహంలోకి శోషించబడిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.అందువల్ల ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను డైట్ లో చేర్చుకోండి.

శోభితతో వైవాహిక జీవితం పై చైతన్య షాకింగ్ కామెంట్స్... తన సలహా తప్పనిసరి అంటూ?
కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!

క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.వ్యాయామం చెడు కొలెస్ట్రాల్ ను క‌రిగించ‌డానికి గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.

Advertisement

ఇక కొలెస్ట్రాల్ త‌గ్గాలంటే ధూమపానం మద్యం పానం అలవాట్లను మానుకోండి.వాటర్ ను ఎక్కువగా తీసుకోండి.

తాజా వార్తలు