'జవాన్' మరియు 'పఠాన్' రికార్డ్స్ కి దగ్గర్లోకి కూడా రాలేకపోతున్న 'టైగర్ 3'..సల్మాన్ ఇమేజి పడిపోయిందిగా!

ఈ ఏడాది బాలీవుడ్( Bollywood ) అంటే షారుఖ్ ఖాన్ నామ సంవత్సరం అనే చెప్పాలి.

ఏడాది ప్రారంభం లో పఠాన్ ( Pathan )చిత్రం తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టి సుమారుగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన షారుఖ్, ద్వితీయార్థం లో జవాన్( Jawan ) చిత్రం తో మరోసారి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు.

ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టే సత్తా షారుఖ్ ఖాన్ తర్వాత సల్మాన్ ఖాన్ మరియు అమీర్ ఖాన్ కి మాత్రమే ఉన్నాయి.అమీర్ ఖాన్ గత కొంతకాలం నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.

ఇక సల్మాన్ ఖాన్ అయితే గత నాలుగేళ్ల నుండి ఫ్లాప్స్ లో ఉన్నాడు.దీంతో ప్రస్తుతం బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఎదురు నిలిచే సత్తా ఉన్న హీరో లేరు అనే విధంగా మారిపోయింది.

కానీ సల్మాన్ అభిమానులు టైగర్ 3 చిత్రం పై భారీ గా అంచనాలు పెట్టుకున్నారు.

Tiger 3 Is Not Even Able To Come Close To The Records Of Jawan And Pathan Sa
Advertisement
Tiger 3 Is Not Even Able To Come Close To The Records Of Jawan And Pathan Sa

ఈ సినిమా కచ్చితంగా జవాన్ మరియు పఠాన్ రికార్డ్స్ ని బద్దలు కొట్టి సరికొత్త రికార్డు ని నెలకొల్పుతుంది అని అనుకున్నారు.కానీ అది జరిగే పరిస్థితి కనిపించడం లేదని ఈ సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థం అవుతుంది.అడ్వాన్స్ బుకింగ్స్ లో మల్టీ ప్లెక్స్ థియేటర్స్ లో కానీ, అలాగే సింగిల్ స్క్రీన్స్ లో కానీ జవాన్ మరియు పఠాన్ చిత్రాలకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది.

ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని షాక్ అనే చెప్పాలి.టాక్ తో సంబంధం లేకుండా రికార్డు స్థాయి వసూళ్లను కొల్లగొట్టడం అనేది సల్మాన్ ఖాన్ బాగా అలవాటు.

బాలీవుడ్ లో ఆయన్ని మించిన మెగాస్టార్ లేడు అని గత దశాబ్దం లో అనిపించుకున్నాడు.అలాంటి సూపర్ స్టార్ నుండి ఒక పాపులర్ బ్లాక్ బస్టర్ సిరీస్ నుండి వస్తున్న టైగర్ 3 ( Tiger 3 ) లాంటి క్రేజీ ప్రాజెక్ట్ కి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

Tiger 3 Is Not Even Able To Come Close To The Records Of Jawan And Pathan Sa

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వస్తాయట.ఇది మూవీ రేంజ్ కి మరియు సల్మాన్ రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి.ఓవర్సీస్ లో జవాన్ చిత్రానికి ప్రీ సేల్స్ నుండి 5 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

కానీ టైగర్ 3 కి కనీసం రెండు మిలియన్ డాలర్లు కూడా ఇప్పటి వరకు రాలేదు.ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టే మాట కాసేపు పక్కన పెడితే, 300 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించడం కూడా కష్టమే.

Advertisement

ఏమి జరుగుతుందో చూడాలి.

తాజా వార్తలు