మాకేది టికెట్.. ఏపీ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి

ఇప్పటివరకు వైసీపీ ,టిడిపి ,జనసేన పార్టీల్లో టికెట్ల కేటాయింపు విషయంలో అనేక వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే .

తమకు టికెట్ దక్కలేదంటూ బహిరంగంగా తమ పార్టీలపై విమర్శలు చేస్తూ చాలా మంది పార్టీలు మారిపోయారు.

ముందుగా వైసీపీలో( YCP ) ఈ పరిస్థితి తీవ్రంగా కనిపించినా,  ఆ తర్వాత అంతా సర్దుమనిగిపోయింది.ఇక టీడీపీ,  జనసేన ,బిజెపి కూటమిగా ఏర్పడి సీట్ల పంపకాలు చేసుకోవడంతో,  ఆయా పార్టీల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కుతూ నిరసనలు చేపట్టారు.

ఇంకా అడపాదడపా ఈ అసంతృప్తులు, అలకలు కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లోను( AP Congress ) ఇదే రకమైన పరిస్థితి కనిపిస్తుంది.

పార్టీ కోసం తాము కష్టపడి పనిచేస్తూ వచ్చినా, చివరినవసరంలో తమకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారనే అసంతృప్తి పలువురు నాయకులు వ్యక్తం  చేస్తున్నారు.

Tickets Issue In Ap Congress Party Details, Ap Elections, Cbn, Chandrababu, Pava
Advertisement
Tickets Issue In Ap Congress Party Details, Ap Elections, CBN, Chandrababu, Pava

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఇండియా కూటమి నాయకులతో,  రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు( Gidugu Rudraraju ) ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సమావేశానికి హాజరైన అనపర్తి,  రాజానగరం కాంగ్రెస్ కార్యకర్తలు టికెట్ల కేటాయింపు వ్యవహారంలో అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు .కష్టకాలంలో కాంగ్రెస్ కోసం పనిచేసిన తమకు టిక్కెట్లు ఇవ్వలేదంటూ తమ ఆగ్రహాన్ని గిడుగు రుద్రరాజు సమక్షంలోనే వ్యక్తం చేశారు.అయితే దీనిపై వెంటనే స్పందించిన ఆయన బుజ్జగింపు ప్రయత్నాలు చేశారు.

అందరిని కలుపుకుని వెళ్తామని , వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేశారు.

Tickets Issue In Ap Congress Party Details, Ap Elections, Cbn, Chandrababu, Pava

అలాగే ఎన్నికల ప్రచారం కోసం పలువురు ప్రముఖులను తీసుకొస్తామంటూ ఆయన చెప్పారు.ఇక కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా విషయంలో చాలామంది ఆశావాహులు అలక చెందడం, వారిని బుజ్జగించడం,  కీలక నాయకులు రంగంలోకి దిగడం వంటివి సాధారణంగా మారిపోయాయి వాస్తవంగా ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంది.అయితే ఇటీవల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి గా వైఎస్ షర్మిల( YS Sharmila ) బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కాంగ్రెస్ నాయకులు కాస్తో,  కూస్తో యాక్టివ్ అయ్యారు.

ఈ నేపథ్యంలోనే టికెట్ ఆశించిన నేతలు ఎక్కవ కావడం తోనే ఈ అసంతృప్తులు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే  బయటపడుతున్నాయి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు