వేసవిలో శరీరానికి శక్తినిచ్చే సూపర్ డ్రింక్ ఇది.. రోజు తాగితే మస్తు బెనిఫిట్స్!

వేసవిలో భారీ ఎండల కారణంగా శరీరంలో నీరు మొత్తం ఆవిరి అయిపోతుంటుంది.దాంతో నీరసం, అలసట వంటివి తరచూ ఇబ్బంది పెడుతుంటాయి.

ఏ పనికి శరీరం సహకరించలేకపోతుంటుంది.అందుకే వేసవిలో శరీరానికి మంచి శక్తినిచ్చే ఆహారాలను తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

అయితే అటువంటి ఆహారాల్లో ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ఒకటి.ఈ డ్రింక్ ను రోజు తీసుకుంటే శరీరానికి బోలెడంత శక్తి లభించడమే కాదు.

మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ సైతం ల‌భిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటి.

Advertisement

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పది బాదం పప్పులు( Almonds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు నానబెట్టుకున్న బాదం పప్పులను పొట్టు తొలగించి మిక్సీ జార్ లో వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ రాగి పిండి ( RAGI FLOUR )వేసి వాటర్ పోసి లూస్ స్ట్రక్చర్ లో కలుపుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని ఒక చిన్న కప్పు వాటర్, ఒకటిన్నర గ్లాసు పాలు ( milk )వేసి హీట్ చేయాలి.పాలు హీట్ అవ్వగానే అందులో రాగి మిశ్రమాన్ని వేసి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్, పావు టేబుల్ స్పూన్‌ యాలకుల పొడి, చిటికెడు కుంకుమపువ్వు వేసి మరో నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి.

చివరిగా చిటికెడు పింక్ సాల్ట్, మూడు టేబుల్ స్పూన్లు బెల్లం పొడి, వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

అంతే మన డ్రింక్ సిద్ధమైనట్లే.ఈ రాగి బాదం డ్రింక్ వేడిగా లేదా చల్లగా కూడా తీసుకోవచ్చు.వేస‌విలో రోజు ఒక గ్లాస్ చొప్పున ఈ డ్రింక్ తాగితే రోజంతా శరీరం ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండేందుకు కావలసిన శక్తి లభిస్తుంది.

Advertisement

ఈ డ్రింక్ డైట్ లో ఉంటే నీరసం అలసట మీ దరిదాపుల్లోకి కూడా రావు.అలాగే వేసవిలో ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శరీరంలో అధిక వేడి తొలగిపోతుంది.

వడదెబ్బ‌ బారిన పడకుండా ఉంటారు.అంతేకాదు ఈ డ్రింక్ ను తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.

వెయిట్ లాస్ అవుతారు.రక్తపోటు అదుపులో ఉంటుంది.

మరియు హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.

తాజా వార్తలు