ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో జరుగుతున్న మంచిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు.నంద్యాల పర్యటనలో భాగంగా ఆయన ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నిధులను పంపిణీ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా సాయం అందిస్తున్నామని జగన్ తెలిపారు.అనంతరం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎద్దేవా చేశారు.వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎంను చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు.అప్పుడు, ఇప్పుడూ ఒకే బడ్జెట్ అన్న సీఎం జగన్.

వాళ్లు చెప్పేది నమ్మొద్దని తెలిపారు.అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు.

Advertisement

అప్పుల పెరుగుదల అప్పటికంటే ఇప్పుడు తక్కువేనని పేర్కొన్నారు.ఈ సందర్బంగా జరుగుతున్న మంచిని చూసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు