నేరేడుచర్ల పరిసరాలను కమ్మేసిన దట్టమైన పొగ మంచు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణ పరిసర ప్రాంతాలలో గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

శనివారం తెల్లవారు జామున దట్టమైన పొగ మంచు కమ్మేసింది.

ఇప్పటికే చలి తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఉదయం 8 గంటల సమయం దాటుతున్నా ప్రధాన రహదారిపై మంచు కురుస్తున్న నేపథ్యంలో ఎదురుగా వాహనాలు కనిపించక,వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎదురెదురుగా వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉందని,ఇటు వాహనదారులు అటు ప్రజలు మంచు తీవ్రతతో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.భయంకరమైన మంచు కురుస్తుంటే వరి పంట పొలాలు కూడా దెబ్బతింటాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మరోవైపు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్రమైన మంచు చలికి ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

Advertisement
గోపీచంద్ మలినేని తర్వాత సినిమాను ఆ తమిళ్ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?

Latest Suryapet News