కేంద్రం సహకరించడం లేదని అపవాదు మోపుతున్నారు..: పురంధేశ్వరి

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించడం లేదని పురంధేశ్వరి పేర్కొన్నారు.అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని అపవాదు మోపుతున్నారని చెప్పారు.

టీడీపీ - జనసేనతో పొత్తు విషయాన్ని జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని ఆమె కోరారు.

మోదీ నేతృత్వంలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు