షుగ‌ర్ వ్యాధికి దూరంగా ఉండాలా? అయితే ఈ ఆహారాలు త‌ప్ప‌నిస‌రి!

షుగ‌ర్ వ్యాధి. దీనినే మ‌ధుమేహం అని కూడా పిలుస్తుంటారు.

దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన మ‌ధుమేహం చాప కింద నీరులా విస్త‌రిస్తూ.

ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్ల మందిని ముప్ప తిప్ప‌ల‌కు గురి చేస్తోంది.

ఇక ఈ మ‌ధ్య కాలంలో వ‌య‌సు పైబ‌డిన వారినే కాదు.వ‌య‌సులో ఉన్న వారిని సైతం ఈ షుగ‌ర్ వ్యాధి ఎటాక్ చేస్తుంది.

అందుకే షుగ‌ర్ వ్యాధి పేరు వింటేనే భ‌యప‌డుతుంటారు.అయితే కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్ లో చేర్చుకుంటే గ‌నుక‌.

Advertisement

మ‌ధుమేహానికి దూరంగా ఉండొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

షుగ‌ర్ వ్యాధి ద‌రి దాపుల్లోకి రాకుండా ఉండాలీ అంటే.వారానికి ఒక‌టి లేదా రెండు సార్లు ఖ‌చ్చితంగా చేప‌లు తీసుకోవాలి.

త‌ద్వారా చేప‌ల్లో ఉండే పోష‌కాలు.షుగ‌ర్ లెవ‌ల్స్‌ను ఎప్పుడూ కంట్రోల్‌లో ఉంచుతాయి.

రెగ్యుల‌ర్ డైట్‌లో త‌ప్ప‌కుండా గ్రీన్ టీ ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే, ప్ర‌తి రోజు గ్రీన్ టీ తాగే వారిలో మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఒకేవేళ గ్రీన్ టీని ఇష్ట‌ప‌డ‌ని వారు.బ్లాక్ కాఫీ అయినా తీసుకోవ‌చ్చు.

Advertisement

అలాగే డైలీ డైట్‌లో ఏదో ఒక రూపంలో దాల్చిన చెక్క‌ను తీసుకోవాలి.రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యతతో ఉండేలా చూసి.మధుమేహం వ్యాధి దరి చేరకుండా చేయ‌డంలో దాల్చిన చెక్క అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

తెల్ల బియ్యం కంటే.గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, ఓట్స్, బార్లీ వంటివి డైట్‌లో ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే, వీటిల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్ కంటెంట్‌ రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉండేలా చేస్తుంది.

ఇక వీటితో పాటు ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాలు అయినా వ్యాయామాలు చేయాలి.నిద్రను నిర్ల‌క్ష్యం చేయ‌కుండా.రోజుకు ఏడు గంట‌లు త‌ప్ప‌కుండా నిద్ర పోవాలి.

ఒత్తిడికి దూరంగా ఉండాలి.మ‌రియు పోష‌కాహారం తీసుకోవ‌డం ఎంత ముఖ్య‌మో.

స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం.అప్పుడే మ‌ధుమేహం ద‌రి చేర‌కుండా ఉంటుంది.

తాజా వార్తలు