ప్రగతి తెలంగాణ దిశగా టీఆర్ఎస్ అడుగులు... ఏం చేయనుందంటే?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలతో పెద్ద ఎత్తున హాట్ హాట్ గా మారిన పరిస్థితి ఉంది.ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో ఇప్పటి నుండే క్షేత్ర స్థాయిలో  వ్యూహ రచన చేస్తున్న పరిస్థితి ఉంది.

 Trs Steps Towards Progress Telangana ... What Do You Want To Do?/telangana Polit-TeluguStop.com

అయితే ప్రతిపక్షాలు  ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెంచి తద్వారా గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.అయితే టీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షాల విమర్శలకు ప్రతి విమర్శ చేయకుండా పరిపాలనా విధానంతో సమాధానం ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే పరిపాలనా వికేంద్రీకరణపై దృష్టి పెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది.

అయితే  ఇక ప్రగతి తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే ఒకప్పుడు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఐటీ హబ్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాలలో కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన నేపథ్యంలో  తాజాగా నల్గొండలో కూడా ఐటీ హబ్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేసిన విషయం తెలిసిందే.తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలిపి 70 పారిశ్రామిక వాడలను నిర్మించాలని నిర్ణయించింది.

Telugu @cm_kcr, @ktrtrs, Bandi Sanjay, Bjp, Etala Rajender, Harish Rao, Telangan

తద్వారా ప్రగతి తెలంగాణతో పాటు నిరుద్యోగానికి శాశ్వత పరిష్కారం అనేది సూచించవచ్చు అనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.దీంతో  అభివృద్ధి అనేది ఒక హైదరాబాద్ కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాలలోకి కూడా విస్తరించడం ద్వారా పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ తో పాటు మరిన్ని జిల్లాలను కూడా కంపెనీలు పరిగణలోకి తీసుకుంటాయి.మరి ప్రభుత్వ ఆలోచన త్వరలోనే అమలుకు నోచుకుంటుందని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube