ఈ పండగ సీజన్లో ఈ వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయట..!

పండగ వస్తుంటే చాలు ప్రతి ఒక్కరు కూడా కొత్త కొత్త ఆఫర్ల పెడతారు.తక్కువ రేటులో కావలిసిన వస్తువులు కొనుక్కోవచ్చని ఎదురు చుస్తూ ఉంటారు.

చిన్న చిన్న వస్తువుల మాట ఎలా ఉన్నాగాని స్మార్ట్‌ టీవీలు, ఫ్రిజ్‌ లు, ఏసీలు, స్మార్ట్‌ ఫోన్‌ లు లాంటి ప్రొడక్ట్‌ లు మాత్రం బాగా సేల్ అవుతాయి.పండగ కాబట్టి అన్ని కంపెనీలు వారి ఉత్పత్తులపై భారీగానే ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తూ వస్తుంటారు.

ఆ ఆఫర్లు చూసి ప్రజలు కూడా వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ పండగ సీజన్‌ కస్టమర్స్ ను పెద్దగా సంతృప్తి పరచదని తెలుస్తుంది.

ఆఫర్స్ మాట పక్కన పెడితే అసలు ధర కంటే ఇంకా కొన్ని రకాల ప్రోడక్ట్స్ పై 8% ధర పెంచేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నట్లు ఒక నివేదిక తెలిపింది.మరి ఆ ప్రోడక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దామా.

Advertisement

ఈ ఏడాది పండగ సీజన్‌ కారణంగా కార్లు, బైక్స్ , స్మార్ట్‌ ఫోన్‌, ల్యాప్‌ టాప్‌, టీవీ, రిఫ్రిజిరేటర్‌, ఏసీ ప్రొడక్ట్‌ల ధరలు పెరగనున్నట్లు ఈ నివేదిక తెలిపింది.వీటిలో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 8% వరకు, టూవీలర్లరపై 1 - 2% వరకు ధరలు పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

అలాగే కొన్ని రకాల బ్రాండ్లపై 3 శాతం నుంచి 8 శాతం పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌ ఇండియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

కొన్ని కంపెనీలు వచ్చే నెల ప్రారంభ సమయానికి టీవీలు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్‌ ల వంటి గృహోపకరణాల ధరలను 3 నుంచి 7% ధరలను పెంచే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.మరో పక్క ఈ వస్తువుల ధరలు పెరుగుదలతో పాటు స్టీల్ ధర కూడా రెట్టింపు అయ్యింది.అల్యూమినియం, రాగి ధరలు 20 నుంచి 25% పెరిగిపోయాయి.

మరోపక్క ఇప్పటికే స్మార్ట్‌ ఫోన్‌ ధరలు కూడా పెరిగిపోయాయి.ఇంకా రానున్న రోజుల్లో మళ్ళీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నారు.

మా వాడైన పరాయి వాడే... సంచలనం రేపుతున్న నాగబాబు కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు