పవన్ ఈ తప్పులన్నీ చేశాడా ? అందుకేనా ఇలా ..

ఏపీలో జగన్ పార్టీ గురించి ఎంత చర్చ నడుస్తుందో అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి కూడా చర్చ నడుస్తోంది.

ఎందుకంటే ఎన్నికల ముందు అధికారం జనసేన హడావుడి చూసి ఆ పార్టీ అధికారం దక్కివుంచుకోవడం ఖాయమని అంతా భావించారు.

దీనికి తగ్గట్టే పవన్ కూడా అనేక బహిరంగ సభల్లో తనను సీఎం అని పిలవాలంటూ అభిమానులతో పిలిపించుకున్నారు.అయితే అదంతా హడావుడికే పరిమితం అయ్యింది.

ఎన్నికల ఫలితాల్లో కేవలం ఒక్కసీటుకే పరిమితం అయిపొయింది.అంతే కాదు సాక్ష్యాత్తు పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండుచోట్ల ఓటమిచెందాడు.

అయితే ఇప్పుడు పార్టీ ఎందుకు ఓటమిపాలయ్యింది అనే విషయం మీద విశ్లేషణలు మొదలయ్యాయి.

Advertisement

రాజకీయ పార్టీ అన్నాక దానికో నిర్మాణం ఉంటుంది.పొలిట్‌ బ్యూరో, కార్యవర్గం, జిల్లా, మండల, గ్రామ కార్యదర్శులు, ఇలా క్షేత్రస్థాయి నుంచి పార్టీ నిర్మాణం ఉంటుంది.ఎంత పాపులర్ లీడరైనా, సినీ గ్లామర్ ఉన్న ఇవన్నీ తప్పనిసరి.

అసలు గ్రౌండ్‌ లెవల్‌లో పార్టీని నడిపించేవాడు లేకపోతే పొలిమేనేజ్మెంట్ లో వెనకబడిపోవాల్సిందే.జనసేన పార్టీలో చూస్తే పవన్ వన్ మ్యాన్ షో తప్ప ఇంకెవరూ ఫోకస్ అవ్వలేదు.

ఆ ఛాన్స్ కూడా పార్టీ తరపున ఇంకెవరికి దక్కలేదు.పార్టీ విధి విధానాలు కూడా ప్రజల్లోకి, కనీసం జనసేన కార్యకర్తల్లోకి కూడా వెళ్ళలేదు.

ఇలా చూసుకుంటే ప్రజారాజ్యం పార్టీ టైంలోనైనా పార్టీ నిర్మాణం కొంతైనా కనిపించింది.పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో అదేమీ మచ్చుకకు కూడా కనిపించలేదు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
పవన్ కు కేంద్ర మంత్రి పదవి ?  నాగబాబుకు అందుకేనా ఛాన్స్ ? 

పవన్ ఎన్నికల ప్రచారంలోనూ అధికార పార్టీ టీడీపీ తప్పులను ఎండగట్టడం మానేసి కేవలం ఏపీలో ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ ను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లారు.కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కయ్యారని సెంటిమెంట్ తో కొట్టారు.

Advertisement

మీకు ఆత్మగౌరవం లేదా, తెలంగాణ నేతలతో కుమ్మక్కయిన వైసీపీని ఆదరిస్తారా అంటూ ప్రజలను కూడా ప్రశ్నించారు.అసెంబ్లీ నుంచి వైసీపీ పారిపోయిందని, అదే తానయితే సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడినని చెప్పుకున్నారు.

పవన్ టీడీపీని వదిలి కేవలం వైసీపీ మీద విమర్శలు చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.అంతే కాదు పవన్ మీద అనుమానాలు కూడా మొదలయ్యాయి.

టీడీపీకి మేలు చేయడానికే పవన్ రంగంలోకి దిగారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో బలపడ్డాయి.

పవన్ రెండురోజులు ప్రజల్లో ఉంటే నాలుగు రోజులు రెస్ట్ లో ఉన్నడడం, వైసీపీ విమర్శించినట్టుగానే, పార్ట్‌ టైం పొలిటీషియన్‌గానే జనాలకు కనిపించారు తప్ప, చంద్రబాబు, జగన్‌లా సీరియస్‌‌ పొలిటిషియన్‌గా కనిపించలేదు.ఆవేశపూరితంగా ప్రసంగించడం, నాలుగు తిట్లు తిట్టడం వెళ్లిపోవడం.ఇవన్నీ ఆయనకు మైనెస్ గా మారాయి.

చివరి వరకూ జనసేన అభ్యర్థులెవరో, ఆ పార్టీ నేతలకే క్లారిటీ లేనంత స్థాయిలో జనసేన వ్యవహారం నడిచింది.అసలు టీడీపీ, వైసీపీ అభ్యర్థులను బలంగా ఢీకొట్టే స్థాయి ఉన్న నాయకులను పవన్ ఎంపిక చేయలేదనే అభిప్రాయం కూడా పార్టీలో నెలకొంది.

అంతెందుకు పవన్ సామాజికవర్గం ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాల్లోనూ పట్టు సాదించేకపోవడం పవన్ చేజేతులా చేసుకున్న తప్పిదమే.అలాగే జనసేన ఆవిర్భావం నుంచు ఎన్నికల వరకు చూసుకుంటే ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులుగా పేరుపడ్డ ఏ ఒక్కరూ జనసేన వైపు వచ్చేందుకు సిద్ధపడలేదు అంటే జనసేన పార్టీ ఎంత రాజకీయ వెనుకబాటుకు గురయ్యిందో మనకే అర్ధం అవుతోంది.

తాజా వార్తలు