క్రమం తప్పకుండా తులసి నీరు.. తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!

తులసి ఆకులు ( Basil leaves )ఆయుర్వేదంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను( Health problems ) దూరం చేయడానికి ఉపయోగిస్తారు.

తులసి ఆకులే కాకుండా గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అలాగే దగ్గు( cough ), ఫ్లూ, పొట్ట,జలుబు లాంటి సమస్యలతో పాటు ఒత్తిడిని తగ్గించేందుకు కూడా తులసి మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఆయుర్వేదంలో తులసిని మూలికల రాణి అని పిలుస్తారు.తులసి టీ ఆరోగ్యకరమైన పానీయంగా ప్రాచుర్యం పొందింది.

నీటిలో తులసి ఆకులను వేసి కూడా త్రాగవచ్చు.

These Are The Benefits Of Drinking Tulsi Water Regularly , Health , Health Tips
Advertisement
These Are The Benefits Of Drinking Tulsi Water Regularly , Health , Health Tips

తులసి నీరు శరీరం మనసు రెండిటికి ఎంతగానో మేలు చేస్తుంది.తులసి నానబెట్టిన నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇవి శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ స్థాయిలను నియంత్రిస్తాయి.దానివల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిపోతుంది.

కణాల డ్యామేజ్ ను ఇది నివారిస్తుంది.తులసి రోగ నిరోధక వ్యవస్థ( Immune system )ను బలపరుస్తుంది.

అలాగే చాలా వ్యాధుల నుంచి దూరం చేస్తుంది.ఇంకా చెప్పాలంటే గ్యాస్, ఎసిడిటీ, అపాన వాయువును తగ్గిస్తుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

తులసి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

These Are The Benefits Of Drinking Tulsi Water Regularly , Health , Health Tips
Advertisement

అంతే కాకుండా ఉదయాన్నే ఖళీ కడుపుతో తులసి నీరు తాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్, క్రిములు బయటకు వెళ్ళిపోతాయి.జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అయిపోతాయి.ఉబ్బసం,( Asthma ) దగ్గు, కఫం, జలుబు ఉంటే ఈ సమస్యలకు పూర్వం రోజులలో తులసిని ఉపయోగించేవారు.

తులసి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా దూరమవుతాయి.అంతే కాకుండా తులసిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయి.ఇది నోటి ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

తులసి నీటిని నోట్లో పోసుకొని పుక్కిలించడం వల్ల చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండి దుర్వాసన కూడా దూరమవుతుంది.

తాజా వార్తలు