బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. జులైలో బ్యాంకు సెలవులు ఇవే

బ్యాంకులతో( Banks ) ప్రతిఒక్కరికీ అవసరం ఉంటుంది.సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ప్రతిఒక్కరికీ బ్యాంకులతో పని ఉంటుంది.

ఆర్థిక లావాదేవీలు, నగదు వ్యవహారాలకు సంబంధించి బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది.అలాగే డబ్బులు బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలన్నా లేదా బ్యాంక్ చెక్ డిపాజిట్ చేయాలన్నా బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.

అయితే బ్యాంకులకు కూడా సెలవులు( Bank Holidays ) ఉంటాయి.ఆదివారంతో పాటు పబ్లిక్ హాలీడేస్‌లో బ్యాంకులు ఉండవు.దీంతో ముందే ఏ రోజు బ్యాంకులు ఉండవనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Advertisement

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank Of India ) ప్రతీనెలా బ్యాంక్ సెలవులను విడుదల చేస్తూ ఉంటుంది.అలాగే ఈ సారి జులైలో కూడా బ్యాంకులు సెలవుల కారణంగా పలు రోజుల్లో మూతపడనున్నాయి.

రెండో శనివారం, ఆదివారాలతో పాటు మెహర్రం రోజున బ్యాంకులు పనిచేయవు.జులైలో 14 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

ఇందులో 5 ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు ఉన్నాయి.

మొత్తం 7 రోజులు శని, ఆదివారాలు ఉన్నాయి.జులై 29 మెహర్రం పబ్లిక్ హాలీడే కావున ఆ రోజున బ్యాంకులు ఉండవు.ఇక ప్రాంతీయ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!

జులై 2, జులై 8 రెండో శనివారం, జులై 9 ఆదివారం, జులై 16 ఆదివారం, జులై 22 నాల్గోవ శనివారం, జులై 23 ఆదివారం, జులై 29 మెహర్రం, జులై 30 ఆదివారం అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి.అలాగే జులై 5 గురు గోవింద్ జయంతికి జమ్ముకశ్మీర్ లో సెలవు.

Advertisement

ఇక జులై 6న మిజోరాంలో ఎంహెచ్‌ఐపీ సెలవుగా ఉంది.జులై 11న త్రిపురలో కేరా పూజా, జులై 13న సిక్కింలో భాను జయంతి సెలవులను బ్యాంకులకు ప్రకటించారు.

తాజా వార్తలు