Tripti Dimri: యానిమల్ సినిమాలో త్రిప్తి డిమ్రీ పాత్ర ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

యానిమల్ సినిమా ( Animal movie ) ప్రస్తుతం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేస్తుంది.

ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుంటుంది.

అయితే ఈ సినిమా గురించి కొంతమంది విమర్శిస్తే మరి కొంత మంది వావ్ సూపర్ ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదు అంటూ తెగ పొగిడేస్తున్నారు.అంతే కాదు స్టార్ డైరెక్టర్ అయిన రాంగోపాల్ వర్మ ( Ram gopal varma ) కూడా ఇలాంటి సినిమా తీసినందుకు ఎంతగానో డైరెక్టర్ ని ప్రశంసిస్తున్నారు.

అలాగే యానిమల్ సినిమాలోని పాత్రకి ఒకరు విజయ్ దేవరకొండ, మరొకరు రణబీర్ కపూర్ తప్ప వేరొకరు చేయలేరు అని బల్ల గుద్ధి మరి చెప్తున్నారు.అయితే అలాంటి సినిమాలో రణబీర్ కపూర్ రష్మిక మందన్న( Rashmika mandanna ) కంటే ఎక్కువ ఫేమస్ అయ్యింది నటి త్రిప్తి డిమ్రి.

రష్మిక మందన్నా కంటే కూడా ఎక్కువ ఎక్కువ గుర్తింపు సంపాదించింది ఈ హీరోయిన్.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా కొన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ తన మాటలతో ఆకట్టుకుంటుంది.

Advertisement

అయితే ఈ సినిమాలో తన బోల్డ్ నెస్ కి చాలా మంది యూత్ కనెక్ట్ అయ్యారు.అయితే అలాంటి ఈ బోల్డ్ పాత్రలో మొదట వేరే హీరోయిన్ ని అనుకున్నారట చిత్ర యూనిట్.

కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో త్రిప్తి డిమ్రి ( Tripti Dimri ) కి ఆ అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది.ఇక త్రిప్తి డిమ్రీ చేసిన ఆ పాత్రలో ముందుగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అయిన సారా అలీఖాన్ ని తీసుకున్నారట.కానీ ఇందులో ఉండే బోల్డ్ నెస్ అలాగే నెగిటివిటీ తనకు అసలు నచ్చలేదట.

అయితే ఇందులో ఉండే కొన్ని సన్నివేశాలను సారా అలీఖాన్ ( Sara alikhan ) తీసివేయమని డిమాండ్ చేసిందట.కానీ ఆ సన్నివేశాలు తీస్తే సినిమాకి అంతగా హైప్ రాదు అనే ఉద్దేశంతో సన్నివేశాలు మార్చడం కుదరదని పాత్రకి హీరోయిన్ సారా అలీఖాన్ ని మార్చేసి త్రిప్తి డిమ్రికి అవకాశం ఇచ్చారట.అలా సారా అలీఖాన్ చేయాల్సిన పాత్రలో త్రిప్తి డిమ్రీ చేసి మంచి గుర్తింపు సంపాదించింది.

అసిస్టెంట్ డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

తాజా వార్తలు