గుంజిళ్ళు తీస్తూ వీఆర్ఏల నిరసన

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండల కేంద్రంలో వీఆర్ఏలు సమ్మెలో భాగంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా గుంజీలు తీస్తూ వినూత్న నిరసన చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపూరి సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి వీఆర్ఏలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ గుంజిళ్ళు తీస్తూ తమ నిరసనను తెలియజేయడం బాధాకరమన్నారు.గ్రామాల్లో అన్నిరకాల ప్రభుత్వ కార్యక్రమాలకు కేంద్ర బిందువుగా ఉండే వీఆర్ఏల పట్ల ప్రభుత్వ మొండివైఖరి విడనాడాలని,లేకుంటే వీఆర్ఏలకు మద్దతుగా కాంగ్రేస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

The Protest Of The VRAs By Taking Out The Grunts-గుంజిళ్ళు త

ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ మండల నాయకులు,వీఆర్ఏలు పాల్గొన్నారు.

ఎనిమిది మంది బెట్టింగ్ రాజాల అరెస్టు
Advertisement

Latest Suryapet News