వరల్డ్స్ బెస్ట్ రెస్టారెంట్స్ లిస్టులో ఆ ఇండియన్ రెస్టారెంట్స్‌ చోటు..?

భారతీయ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల హృదయాలను, రుచి మొగ్గలను గెలుచుకుంటున్నాయి.ఇలాంటి టేస్టీ వంటకాలు తయారు చేసే భారతీయ రెస్టారెంట్ల పాపులారిటీ రోజురోజుకీ పెరుగుతోంది.

అంతర్జాతీయ వంటక రంగంలో ఇండియన్ చెఫ్‌ల ప్రభావం నుంచి భారతదేశ మసాలా మార్కెట్ల వృద్ధి వరకు, దేశపు ఆహార సంస్కృతి పెద్ద మార్పును చవిచూసింది."వరల్డ్స్ 50 బెస్ట్ రెస్టారెంట్స్" ( Worlds 50 Best Restaurants )అనే ప్రముఖ సంస్థ తాజాగా 51 నుంచి 100 వరకు స్థానాల్లో రెస్టారెంట్లను ర్యాంక్ చేస్తూ లిస్ట్‌ ను విడుదల చేసింది.

ఈ లిస్ట్‌లో భారతదేశానికి చెందిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం అని చెప్పుకోవచ్చు.ఆ రెండు రెస్టారెంట్లు ఏవో చూద్దాం.

• మాస్క్, ముంబై (78వ స్థానం)

ముంబైకి చెందిన ఈ రెస్టారెంట్ ప్రారంభమైన సమయం నుంచి చాలామందిని ఆకట్టుకుంది.ఈ జాబితాలో ఇటీవలే చోటు దక్కించుకున్నప్పటికీ, ఇది చాలా కాలం క్రితమే ఆసియాలో గుర్తింపు పొందింది.ఈ రెస్టారెంట్‌ను 2016లో అదితి దుగార్ స్థాపించాడు.2022 వరకు ప్రధాన చెఫ్‌గా ప్రతీక్ సాధు( Prateek Sadhu ) నాయకత్వం వహించారు."భారతదేశంలోనే మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్ రెస్టారెంట్"గా ఇది ప్రశంసలు అందుకుంది.

Advertisement

అత్యంత నూతనమైన విధానంలో ఇండియన్ రెసిపీస్ తయారు చేయడం,, స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించడం వల్ల ఈ రెస్టారెంట్‌ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుంది.

• యాక్సెంట్, ఢిల్లీ

ఢిల్లీకి చెందిన ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ ప్రపంచంలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల జాబితాలో తిరిగి ప్రవేశించింది.చెఫ్ మనీష్ మెహ్రోత్రా ( Chef Manish Mehrotra )నాయకత్వంలోని ఇండియన్ యాక్సెంట్ రెస్టారెంట్ ప్రతిష్టాత్మక "వరల్డ్స్ 50 బెస్ట్ రెస్టారెంట్స్" జాబితాలో 89వ స్థానాన్ని దక్కించుకుంది.ఈ రెస్టారెంట్ గతంలో ఏడు సంవత్సరాలు (2015 నుంచి 2021 వరకు) భారతదేశంలోనే ఉత్తమ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది.

భారతీయ సమకాలీన వంటకాల ప్రమాణాలను పెంచుతున్నందుకు ఇండియన్ యాక్సెంట్‌ను వరల్డ్స్ 50 బెస్ట్ ప్రశంసించింది.చెఫ్ మెహ్రోత్రా రూపొందించిన క్రియేటివ్ టేస్టింగ్ మెనూలు చాలామందిని ఆకట్టుకుంటాయి.

శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!
Advertisement

తాజా వార్తలు