మనలో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.బరువు (weight)పెరగడం వల్ల షేప్ అవుట్ అయ్యి లావుగా తయారవుతారు.
దీంతో ఇరుగు పొరుగు వారు చేసే బాడీ షేమింగ్ కామెంట్స్ ఎంతగానో బాధ పెడతాయి.పైగా అధిక బరువు అనేక సమస్యలకు మూలం అవుతుంది.
ఈ క్రమంలోనే బరువు తగ్గి ( weight loss) సన్నగా మారాలని చాలా మంది భావిస్తుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
నిత్యం ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే వెయిట్ లాస్ తో పాటు అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బీట్ రూట్(Beetroot) ముక్కలు, పావు కప్పు పీల్ తొలగించిన ఫ్రెష్ అలోవెరా (Aloe vera)వేసుకోవాలి.అలాగే ఒక గ్లాస్ దానిమ్మ రసం, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో జ్యూస్ లో ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.ఈ దానిమ్మ బీట్ రూట్ అలోవెరా జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలని ఆరాటపడుతున్న వారు నిత్యం ఉదయం ఒక గ్లాసు ఈ జ్యూస్ ను కనుక తీసుకుంటే మెటబాలిజం రేటు మంచిగా పెరుగుతుంది.శరీరంలో అధిక కేలరీలు మొత్తం బర్న్ అవుతాయి.కొవ్వు కరుగుతుంది.కొద్ది రోజుల్లోనే మీరు బరువు తగ్గి స్లిమ్ గా మారతారు.పైగా ఈ జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలలో బయటకు పంపుతుంది.బాడీని డీటాక్స్ చేస్తుంది.
చర్మాన్ని కాంతివంతంగా యవ్వనంగా మెరిపిస్తుంది.కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
రక్తహీనత (anemia)దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.మరియు ఈ జ్యూస్ మిమ్మల్ని హైడ్రేటెడ్ గా, ఎనర్జిటిక్ గా సైతం ఉంచుతుంది.