కుక్క అరవడంతో తలుపువైపు చూసిన వ్యక్తి.. అంతలోపే ఊహించని షాక్..?!

కుక్కలు మనుషులతో అత్యంత సన్నిహితంగా ఉంటాయి.పెంపుడు జంతువుల్లో కుక్కలు( dogs ) ఎక్కువగా మనుషుల పట్ల ప్రేమను చూపిస్తాయి.

దీంతో కుక్కలను ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు.అయితే కుక్కలు ఒక్కొక్కసారి యజమానులను చాలా పెద్ద ప్రమాదాల నుంచి కాపాడుతూ ఉంటాయి.

యజమానుల పట్ల నమ్మకంగా ఉంటూ వివిధ ప్రమాదాల నుంచి వారిని రక్షిస్తాయి.తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యజమానులను రక్షిస్తూ ఉంటాయి.

The Man Looked At The Door When The Dog Was Barking Then An Unexpected Shock, Do

తాజాగా ఒక కుక్క యజమానిని ఆశ్చర్యపరిచింది.పెంపుడు కుక్క గట్టి గట్టిగా ఆరుస్తుండటంతో యజమాని తలుపు తీసి చూడగా ఆశ్చర్యకర దృశ్యం కనిపించింది.ఒక పెద్ద ఎలుగుబంటి( bear ) ఇంట్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా దానిని కుక్క అడ్డుకుంటోంది.

Advertisement
The Man Looked At The Door When The Dog Was Barking Then An Unexpected Shock, Do

దీంతో ఎలుగుబంటిని చూసి షాక్ అయిన యజమాని.కుక్కను పక్కకు లాగాడు.

తర్వాత ఎలుగుబంటిని బయటకు తరిమేసే ప్రయత్నం చేశాడు.దీంతో అతడిపై ఎలుగుబంటి దాడి చేసే ప్రయత్నం చేసింది.

ఎలుగుబంటి ఇంట్లోకి రాకుండా అక్కడ ఉన్న ఒక సోఫాను అడ్డంగా పెడతాడు.

The Man Looked At The Door When The Dog Was Barking Then An Unexpected Shock, Do

ఎలుగుబంటి ఇంట్లోకి వచ్చేందుకు కాసేపు ప్రయత్నాలు చేసింది.ఆ తర్వాత ఇక చేసేదేమీ లేక అక్కడ నుంచి వెళ్లిపోయింది.దీంతో యజమాని ఊపిరిపీల్చుకున్నాడు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
ఓరి దేవుడో.. జంతువులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా.. (వీడియో)

పెంపుడు కుక్క ఎలుగుబంటిని గమనించి అడ్డుకోవడం వల్ల అది ఇంట్లోకి రాలేకపోయింది.కుక్క అరవడం వల్ల యజమాని గమనించి అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని నెటిజన్లు అంటున్నారు.ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఇప్పటివరకు ఈ వీడియోకు 20 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.యజమానిని కాపాడేందుకు కుక్క చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

కుక్కలు తమ యజమానులను కాాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తాయో దీనిని బట్టి తెలుస్తుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.ఈ కుక్క చేసిన పనికి అందరూ ఫిదా అయిపోతున్నారుజ.

తాజా వార్తలు