ఆవు గొంతును నోట కరచుకున్న సింహం.. అది చూసిన రైతు ఏం చేశాడంటే..

అత్యంత క్రూరమైన సింహాలు( lions ) ఆవులను అధికంగా వేటాడుతుంటాయి.మన ఇండియాలో అడవుల నరికివేత ఎక్కువ కావడం వల్ల సింహాలు జనావాసాల్లోకి కూడా వస్తున్నాయి.

ఆపై పెంపుడు ఆవులపై దాడి చేస్తూ వాటిని తినేస్తున్నాయి.ఇటీవల కూడా ఒక ఆడ సింహం ఆవు మెడను అదును చూసి నోట కరచుకుంది.

దాన్ని చంపేసి తినేయాలని అనుకుంది.అయితే ఆ ఆవు యజమాని, రైతు అయిన కీర్తి సింగ్ చౌహన్( Kirti Singh Chauhan ) అటువైపుగా వచ్చి ఈ షాకింగ్ దృశ్యం చూశారు.

తన ఆవు చావు బతుకుల మధ్య కొట్లాడుతున్న పరిస్థితిని చూసి చలించి పోయారు.

Advertisement

సింహాన్ని చూసి పారిపోకుండా ధైర్యంగా ముందుకు అడుగులు వేశారు.అంతేకాదు, బిగ్గరగా అరుస్తూ ఆ సింహాన్ని భయపెడుతూ రాయి విసిశారు.దాంతో భయపడిన సదరు సింహం ఆవుని విడిచి పెట్టి పొదల్లోకి పారిపోయింది.

ఆవును ఆ సింహం నోటితో బలంగా కొరికింది కాబట్టి దానికి బాగానే గాయాలైనట్టు తెలుస్తోంది.అయినా ఆ ఆవు నేల కూలకుండా తన కాళ్లపై తాను నిల్చోని బాగానే తిరుగుతూ కనిపించింది.

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ ( Gir Somnath in Gujarat )జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.ఒక రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.అదే రోడ్డుపై కారులో వెళ్తున్న ఒక వ్యక్తి ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించారు.

ఆ వీడియోను జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీన్ని చూసిన నెటిజన్లు ఆ రైతు ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.తన పశువును ధైర్యం చేసి కాపాడిన ఆ రైతుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వైరల్: కోతులు కొట్లాటకు ఆగిపోయిన రైళ్లు!

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు