IPL 23 షెడ్యూల్‌ వచ్చేసింది… వివరాలివే?

అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న IPL 2023 షెడ్యూల్‌ వచ్చేసింది.ప్రపంచ క్రికెట్​లో ఎన్ని లీగులు వున్నాసరే అవన్నీ IPL ముందు దిగదుడుపే.

అందుకే IPLని బాప్​ ఆఫ్ ఆల్ క్రికెట్​ లీగ్స్ అని చెప్తారు.వేర్వేరు దేశాల క్రికెటర్లు అందరూ ఒక్కతాటిపై నడిచి క్రికెట్ ప్రేమికులకు ఎంటర్​టైన్​మెంట్​ను అందిస్తారు.

అందుకే దానికి అంత డిమాండ్.అయితే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ IPL కోసం మీరు మరెన్నో రోజులు వెయిట్​ చేయనక్కర్లేదు.

లీగ్​ ఆరంభంపై ఫ్యాన్స్​ ఎదురుచూపులకు తెరదించుతూ BCCI​ తాజా అప్​డేట్ ఇచ్చింది.

Advertisement

అవును, మార్చి 31 నుంచి IPL 2023​ ప్రారంభం కానుంది.BCCI తెలిపిన వివరాలు ప్రకారం లీగ్ దశలో చివరి మ్యాచ్​ మే 21న జరగనుంది.అలాగే ఫైనల్​ మ్యాచ్​ మే 28న నిర్వహిస్తారు.

లీగ్​ దశలో మొత్తం 70 మ్యాచులు ఉండగా అందులో 18 డబుల్​ హెడర్స్ ఉంటాయి.ఇక టోర్నీలో తొలి మ్యాచ్​ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరగనుంది.

దీనికి గుజరాత్​లోని అహ్మదాబాద్​ వేదిక కానుంది.గత సీజన్​ విన్నింగ్‌ టీమ్​ కెప్టెన్ హార్దిక్​​ పాండ్యా, ఫేవరెట్​ సీఎస్కే సారథి ఎంఎస్ ధోనీలు గ్రౌండ్​లో తలపడనున్నారు.

కాగా, ఐపీఎల్​ 2023లో మొత్తం రెండు గ్రూపులు ఉండనున్నాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

గ్రూప్​ – Aలో ముంబై ఇండియన్స్, కోల్​కతా నైట్ రైడర్స్, రాజస్థాన్​ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి.అలాగే గ్రూప్​ – Bలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఉన్నాయి.గత IPLలో చతికల పడిన ఆటగాళ్లు ఈ ఐపీఎల్​ 2023లో అయినా బాగా ఆడాలని కోరుకుందాం.

Advertisement

అలాగే గత IPLలో బాగా ఇరగదీసిన వారు ఇంకా బాగా ఆడాలని ఆశిద్దాము.ఇక మీరు కూడా ఈ సీజన్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారా?.

తాజా వార్తలు