అనుమానం పెనుభూతం అయిన వేళ.. మనిషి మృగంగా మారి.. !

ప్రస్తుతం మృగాలు అడవుల్లో లేవనిపిస్తుంది.లోకంలో మనుషుల ముసుగేసుకుని సంచరిస్తున్నట్లుగా కొన్ని ఘటనలు నిరూపిస్తున్నాయి.

మానవత్వం మంటకలసిపోగా, విచక్షణ ఆవిరిగా మారిన వేళ మనుషులే తోడేళ్లకంటే దారుణంగా తోటి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.ఇలాంటి ఘటన నిజామాబాద్ పట్టణంలోని ఐదవ టౌన్ పరిధి నాగారంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది.

ఆ వివరాలు చూస్తే.నాగారం 80 క్వార్టర్స్ కాలనీకి చెందిన షేహనాజ్ బేగం(30)ను భర్త షేక్ సల్మాన్ కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్యచేశాడు.

కాగా వీరిద్దరికి 11 ఏళ్ల కిందట వివాహం జరిగింది.ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు కలిగిన భార్య పై సల్మాన్ అనుమానం పెంచుకోవడంతో తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవట.

Advertisement

దీంతో ఓపిక నశించిన షహనాజ్ రెండు నెలల కిందట పిల్లలతో పాటు పుట్టింటికి వెళ్ళిపోయింది.ఆ తర్వాత అందరు సర్దిచెప్పడంతో తిరిగి భర్తవద్దకు చేరిందట.

అయిన మారని సల్మాన్ అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి కత్తితో భార్య గొంతు కోశాడు.ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో తీవ్ర రక్తస్రావం జరిగి షేహనాజ్ బేగం ప్రాణాలు కోల్పోయింది.

ఇక స్దానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్దలానికి చేరుకున్న పోలీసులు షేక్ సల్మాన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

సుమ బండారం బయటపెట్టిన యాంకర్.... సుమ పరువు మొత్తం పోయిందిగా?
Advertisement

తాజా వార్తలు