మానవత్వం మరిచిన మానవ మృగాలు...!

సూర్యాపేట జిల్లా: సభ్య సమాజం సిగ్గుపడేలా మానవత్వం లేని ఇద్దరు మానవ మృగాలు ఓ మానసిక వికలాంగురాలిపై అత్యంత పాశవికంగా అఘాత్యానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల లాల్ లక్ష్మీపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

సోమవారం లాల్ లక్ష్మిపురం గ్రామంలో మానసిక వికలాంగురాలైన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలు ఫిర్యాదు మేరకు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రవీందర్ నాయక్ తెలిపారు.

దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా ఎక్కడో ఓ చోట ఇలాంటి అమానుష ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయని, ఎందరో మహిళలు,చిన్న పిల్లలు,వృద్దులు కూడా కామాంధుల చేతుల్లో పడి నలిగిపోతున్నారని పలువురు మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు.ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి అందరికీ కనువిప్పు కలిగేలా అత్యంత కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పిన బండ్ల గణేష్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Latest Suryapet News