ఈ హోటల్ మొత్తాన్ని ఉప్పుతోనే నిర్మించారట.. ఎక్కడంటే !

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు దాగున్నాయి.కొన్ని సహజసిద్ధమైన వింతలైతే, మరికొన్ని మానవ నిర్మితమైన వింతలను చెప్పొచ్చు.

వీటి గురించి తెలుసుకుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే.ఇప్పుడు మనం ఒక చిత్రవిచిత్రమైన మానవ నిర్మితం గురించి తెలుసుకుందాం.

దీనిని పూర్తిగా ఉప్పు తోనే నిర్మించారు.సాధారణంగా మట్టితో నిర్మిస్తేనే ఈ రోజుల్లో భవనాలు నిలవడం లేదు.

అలాంటిది ఒక పెద్ద హోటల్‌ను ఉప్పుతో బిల్డ్ చేశారు.అయితే ఉప్పు అన్న తర్వాత కరిగిపోదా అనే అనుమానం అందరికీ కలగకమానదు.

Advertisement
The Entire Hotel Was Built With Salt Slat, Hotel, Viral News, Viral Latest, News

అలా జరగకుండా ఉండేందుకు హోటల్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే.

బొలీవియాలో పాలాసియో డి సాల్‌ అనే హోటల్‌ను పూర్తిగా ఉప్పుతో కట్టారు.అందరూ హోటల్‌కు ఫుడ్ తినడానికి వెళతారు కానీ ఈ హోటల్ కి మాత్రం చూడ్డానికే ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పోటెత్తుతుంటారు.

ఈ హోటల్‌లోని గోడలు, పైకప్పు, మిగతా ఫర్నిచర్ అంతా కూడా ఉప్పుతో తయారు కావడం విశేషం.ఈ భవనంలో 12 గదులు, డైనింగ్‌ హాల్స్, గోల్ఫ్‌కోర్స్‌లు, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఉప్పు తోనే తయారు చేశారు.

దీనివల్ల ఇవన్నీ కూడా తెల్లగా మెరుస్తూ చూపరులను కట్టిపడేస్తాయి.

The Entire Hotel Was Built With Salt Slat, Hotel, Viral News, Viral Latest, News
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

బొలీవియాలోని ఒక ఎడారిలో "సలార్‌ డి ఉయునీ" ఉప్పు దొరుకుతుంది.ఈ ఉప్పును చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు.అయితే ఉప్పు ఎడారిని వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ హోటల్ నిర్మించారట.

Advertisement

ఉప్పు కరిగిపోకుండా ఉప్పు ఇటుకలను ఫైబర్‌గ్లాస్‌తో చాలా కట్టుదిట్టంగా ప్యాక్ చేశారు.ఇందులోకి నీరు గాలి వంటివి చొరబడవు.

అందుకే నొప్పితో నిర్మితమైన ఈ హోటల్ చాలా దృఢంగా ఉంటుంది.ఏది ఏమైనా దీని గురించి తెలుసుకున్న ప్రజలందరూ నోరేళ్లబెడుతున్నారు.

తాజా వార్తలు