పాన్ ఇండియా దిగ్గజ సంస్థ చేతికి 'వారసుడు' ఆడియో హక్కులు!

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి ప్రెజెంట్ చేస్తున్న సినిమాల్లో వారసుడు ఒకటి.

ఇతడు తెలుగు మీద ఫోకస్ చేయడంతో తెలుగు డైరెక్టర్ ను లైన్లో పెట్టాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.తమిళ్ లో వరిసు అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి కూడా చేస్తున్నాడు.దిల్ రాజు భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతో విజయ్ తెలుగులో గ్రాండ్ గా లాంచ్ అవ్వడానికి ప్లానింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి అప్డేట్ కావాలని అందరు అడుగు తున్నారు.

Advertisement
Thalapathy Vijay Varisu Music Rights, Varisu Music Rights, T Series, Dil Raju, R

అయినా కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుండి అప్డేట్ ఇవ్వలేదు.మొన్న దీపావళి కానుకగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన అప్పుడు కూడా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా ఆడియో హక్కులు అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది.

Thalapathy Vijay Varisu Music Rights, Varisu Music Rights, T Series, Dil Raju, R

భారీ ధరకు వారసుడు ఆడియో హక్కులను పాన్ ఇండియా దిగ్గజ సంస్థ అయినటువంటి టి సిరీస్ సంస్థ వారు సొంతం చేసుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కన్ఫర్మ్ అయ్యింది.  ఇక ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగు, తమిళ్ లోనే రిలీజ్ కాబోతుంది అని అంతా అనుకున్నారు.

కానీ ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వస్తుంది.సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.చూడాలి మరి ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు