తాగుబోతు రమేష్ కు ఘోర అవమానం... అసలేం జరిగిందంటే?

తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ సినీ పరిశ్రమలో లేరనేది కాదనలేని వాస్తవం.

సినిమాలో అన్ని రకాల క్యారెక్టర్లు చేయడం కన్నా కామెడీ చేయడం చాలా కష్టమైన విషయం.

అయితే మన తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న కమెడియన్లలో తాగుబోతు రమేష్ ఒకరు.బహుశా తాగుబోతు రమేష్ తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

Thagubothu Ramesh Removed From Team Leader Position, Thagubothu Ramesh,Jabardast

అంతలా తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకుల హృదయాలలో తనదైన ముద్ర వేసుకున్నాడు.అయితే ఈ మధ్య సినిమా అవకాశాలు తగ్గడంతో, అదే సమయంలో జబర్దస్త్ కామెడీ షో నుండి ఆహ్వానం రావడంతో జబర్దస్త్ లో టీమ్ లీడ్ గా ఎంట్రీ ఇచ్చారు.

మొదటిగా తాగుబోతు రమేష్ టీమ్ పర్ఫార్మెన్సు అంతగా లేకున్నా, కొద్ది రోజుల తరువాత పుంజుకున్నా ఫలితం లేకపోయింది.తరువాత టీమ్ పర్ఫార్మెన్సు అంతగా రాణించకపోవడంతో టీమ్ ను తొలగించారు.

Advertisement

తరువాత తాగుబోతు రమేష్ ను వేరే టీమ్ లో కంటెస్టెంట్ గా చేర్చారు.ఇప్పుడిప్పుడే వచ్చిన జూనియర్ ఆర్టిస్టుల దగ్గర ఎప్పుడో వచ్చిన తాగుబోతు రమేష్ ను కంటెస్టెంట్ గా చేయడం దారుణ అవమానంగా తాగుబోతు రమేష్ అభిమానులు భావిస్తున్నారు.

వారాంతటగా వారే జబర్దస్త్ కు ఆహ్వానించి ఇలా చేయడం భావ్యం కాదని తాగుబోతు రమేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు