టెక్సాస్ కాల్పులు : ఎదురుగా దుండగుడు, అయినా 40 నిమిషాల పాటు కాలయాపన.. పోలీసులపై విమర్శలు

అమెరికాలోని టెక్సాస్‌లో ఇటీవల ఓ పాఠశాలలో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది.

అంతేకాదు అమెరికాలో గన్ కల్చర్‌గా సీరియస్‌గా దృష్టి సారించాలని అక్కడి ప్రభుత్వానికి సూచించింది.ఈ సంగతి పక్కనబెడితే.

టెక్సాస్ కాల్పుల ఘటనకు సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్ద వేచి చూసే ధోరణి అనుసరించారని అందుకే ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.మంగళవారం ఉదయం ఉవాల్డీ ప్రాంతంలోని రాబ్ ప్రాథమిక పాఠశాలలోకి 11.28 గంటలకు నిందితుడు సాల్వడార్ రామోస్.తుపాకీతో ప్రవేశించాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.క్షణాల్లోనే ఘటనాస్థలికి చేరుకుని పాఠశాలను చుట్టుముట్టారు.సుమారు 12.58 గంటల సమయంలో దుండగుడిని హతమార్చినట్లు పైఅధికారులకు సమాచారం అందించారు.దీనికి ముందు 12.45 గంటల ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ బృందం ఒకటి స్కూల్‌లోకి ప్రవేశించింది.ఆ తరువాత నిందితుడున్న గదిలోకి దూసుకెళ్లి అతడిని మట్టుపెట్టింది.

Texas Shooting: Cops Waited Outside Classroom As Students Begged For Help,texas,
Advertisement
Texas Shooting: Cops Waited Outside Classroom As Students Begged For Help,Texas,

అయితే స్పెషల్ కమాండోలు రావడానికి ముందే , అప్పటికే లోపల ఉన్న పోలీసులు రామోస్‌పై ఎలాంటి దాడి చేయకుండా దాదాపు 40 నిమిషాల పాటు వేచి చూశారన్న వార్త వైరల్ అవుతోంది.దీంతో స్థానికులు భగ్గుమంటున్నారు.దీనిపై ఉవాల్డీ పోలీస్ చీఫ్ వివరణ ఇచ్చారు.

తప్పు జరిగిందంటూ కంటతడి పెట్టుకున్నారు.ఘటనా స్థలంలో ఉన్న పోలీసు అధికారి అక్కడి పరిస్థితిని తప్పుగా అర్ధం చేసుకున్నారని ఆయన తెలిపారు.

మరోవైపు.పోలీసులు వేచి చూస్తున్న సమయంలోనే తమను కాపాడాలంటూ విద్యార్థులు పలుమార్లు ఫోన్ చేసినట్టు కథనాలు వెలుగులోకి రావడంతో పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీనిపై టెక్సాస్ గవర్నర్ గ్రెట్ అబాట్ మీడియాతో మాట్లాడుతూ.తనకు సరైన సమచారం అందలేదని తెలిపారు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

తాను కూడా తప్పుదారి పట్టించానని.ఎందుకంటే తనకు అందిన సమాచారం కొంత వరకు సరికాదని తేలిందని గవర్నర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు