అనంతపురం అర్బన్ టీడీపీ ప్రచారంలో ఉద్రిక్తత

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ( TDP ) నిర్వహిస్తున్న ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది.

గుత్తి రోడ్డులో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్( Daggubati Prasad ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి( Ex MLA Prabhakar Chowdary ) వర్గీయులు ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.నల్ల జెండాలు, నల్ల రిబ్బన్లు కట్టుకుని అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

గో బ్యాక్ ప్రసాద్ అంటూ ప్రభాకర్ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అనంతరం అర్బన్ నియోజకవర్గ( Anantapur Urban Constituency ) టికెట్ ను ప్రభాకర్ చౌదరికే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే అసెంబ్లీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ తో పాటు ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణను కూడా అడ్డుకున్నారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు